Sitaram Yechury: తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.. మధ్యప్రదేశ్ లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చు.. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED ), సీబీఐ.. బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆయన ఆరోపించారు. దేశంలో బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోంది.. ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు.. ఉత్తరాఖండ్ లో టన్నెల్ కు ఎవరు అనుమతి ఇచ్చారో.. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి అని సీతారం ఏచూరి ప్రశ్నించారు.
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోడీ పాల్పడుతున్నారు అయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇవ్వదు అంటూ సీతారం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది.. యాంటి బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు.. హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు ఉంటుంది.. ఇండియా కూటమిలో ఇప్పటికే ఉన్నాం.. సీపీఎం ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా పొత్తులు అనేది అసంభవం అని సీతారం ఏచూరి పేర్కొన్నారు.
Read Also: China Pneumonia: చైనాలో విస్తరిస్తున్న కొత్తరకం న్యుమోనియా.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన!
ఎన్నికల్లో ధన దాహం విపరీతంగా ప్రభావం చూపుతోంది అని సీతారం ఏచూరి అన్నారు. పోరాటాలకు ఎర్ర జెండా కావాలి.. ఎన్నికలు వచ్చే సరికి ఇంకో పార్టీ కావాలి.. ఇలా ఎందుకు జరుగుతుంది అని జనాలను మేము అడుగుతున్నాము.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే బెంగాల్, త్రిపురలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము.. ఇండియా కూటమిలోకి బీజేపీ యేతర పార్టీలు అన్ని రావాలి.. కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉండటం వల్ల రాలేకపోతున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!