NTV Telugu Site icon

Sitaram Yechury: తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు

Sitaram Yechuri

Sitaram Yechuri

దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.. మధ్యప్రదేశ్ లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చు.. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED ), సీబీఐ.. బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆయన ఆరోపించారు. దేశంలో బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోంది.. ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు.. ఉత్తరాఖండ్ లో టన్నెల్ కు ఎవరు అనుమతి ఇచ్చారో.. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి అని సీతారం ఏచూరి ప్రశ్నించారు.

Read Also: IPL Auction 2024: ముంబై ఇండియన్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. ఆ ముగ్గురిలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఎవరు?

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోడీ పాల్పడుతున్నారు అయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇవ్వదు అంటూ సీతారం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది.. యాంటి బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు.. హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు ఉంటుంది.. ఇండియా కూటమిలో ఇప్పటికే ఉన్నాం.. సీపీఎం ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా పొత్తులు అనేది అసంభవం అని సీతారం ఏచూరి పేర్కొన్నారు.

Read Also: China Pneumonia: చైనాలో విస్తరిస్తున్న కొత్తరకం న్యుమోనియా.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన!

ఎన్నికల్లో ధన దాహం విపరీతంగా ప్రభావం చూపుతోంది అని సీతారం ఏచూరి అన్నారు. పోరాటాలకు ఎర్ర జెండా కావాలి.. ఎన్నికలు వచ్చే సరికి ఇంకో పార్టీ కావాలి.. ఇలా ఎందుకు జరుగుతుంది అని జనాలను మేము అడుగుతున్నాము.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే బెంగాల్, త్రిపురలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము.. ఇండియా కూటమిలోకి బీజేపీ యేతర పార్టీలు అన్ని రావాలి.. కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉండటం వల్ల రాలేకపోతున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు.