NTV Telugu Site icon

Revanth Reddy: నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పర్యటన

Revanthreddy

Revanthreddy

Revanth Reddy TOUR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరిట మేనిఫెస్టోను ప్రకటించింది.. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై హస్తం నేతలు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో కూడా అదే ప్రణాళికను ఫాలో అవుతుంది. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన నేతలు, అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకాస్త స్పీడ్ పెంచేందుకు రెడీ అయ్యారు.

Read Also: ESIC Recruitment 2023: పది అర్హతతో ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. 17,710 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

ఇక, ఇందులో భాగంగా నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు చిన్నమల్లారెడ్డి, సాయంత్రం 5.00 గంటలకు రాజంపేట, రాత్రి 7 గంటలకు బిక్నూర్ కార్నర్ మీటింగ్​లో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 37 అంశాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆరు హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని రేవంత్ హామీ ఇవ్వనున్నారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు.

Show comments