Harish Rao: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్‌లో ఉన్నారు.. జగ్గారెడ్డి సీఎం అవుతా అంటున్నారు.. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు. జానారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు కానీ సీఎం అవుతా అంటున్నారని.. కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎంలు ఉన్నారు అని ఆయన విమర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.
Also Read: Revanth Reddy Fire On KCR: నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి
కాంగ్రెస్ 80 సీట్లు గెలుస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నారని.. రాకపోతే దేనికంటే దానికి సిద్ధం అంటున్నారని మంత్రి హరీష్ తెలిపారు. గత ఎన్నికల్లో కూడా రేవంత్ ఇలానే అన్నాడు.. కొడంగల్‌లో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు.. అక్కడికి వెళ్లి నేను ఓ మీటర్ పెడితే బోర్లాబొక్కల పడ్డాడు.. మరి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోలేదని మంత్రి హరీష్ ప్రశ్నించారు. ఉత్తమ్ కాంగ్రెస్ గెలవకపోతే నేను గడ్డమే తీయను అన్నారని.. కేసీఆర్ 88 సీట్లతో గెలిస్తే ఇద్దరు మాట తప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి మేకపోతు గాంబిర్యాలు అంటూ మంత్రి హరీష్ విమర్శలు గుప్పించారు.