Milk Abhishekam to Revanth Reddy and Rahul Gandhi: తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫలితాలు వెలువరించిన విధంగా ఇప్పుడు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 58 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా టిఆర్ఎస్ పార్టీ 33 స్థానాలలో లీడింగ్ లో ఉంది. బిజెపి ఏడు స్థానాల్లో, సిపిఐ ఒక్క స్థానంలో లీడింగ్ లో ఉంది. అయితే ప్రస్తుతానికి అందుతున్న అనధికార లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో, బిజెపి 11 స్థానాలలో, ఎంఐఎం మూడు స్థానాలలో లీడింగ్ లో ఉంది. ఇక కాంగ్రెస్ కి స్పష్టమైన మెజారిటీ కనిపిస్తున్న నేపద్యంలో హైదరాబాద్ లోని కాంగ్రెస్ అధికారిక కార్యాలయం గాంధీభవన్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రెస్ కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది.
Congress Leading: అధిక స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్
గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బ్యానర్లకు పాలాభిషేకం చేస్తుండగా దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన వెంటనే వారిని హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్ కి తీసుకువచ్చే బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏఐసీసీ అప్పగించింది. హోటల్ కి చేరుకున్న వెంటనే వారందరితో డీకే శివకుమార్ భేటీ కానున్నారు. ఈరోజు రాత్రికి సీఎల్పీ సమావేశం నిర్వహించి పరిస్థితులకు అనుగుణంగా గెలుపొందిన ఎమ్మెల్యేలను హైదరాబాదులోనే ఉంచాలా లేక బెంగళూరు తరలించాలా అనే విషయం మీద నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలుస్తోంది.