8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
- షియోమీ 18 ప్రో మాక్స్ ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్
- 6.9 అంగుళాల 120Hz LTPO OLED డిస్ప్లే
- వెనుక భాగంలో 2.9 అంగుళాల 120Hz AMOLED సెకండరీ డిస్ప్లే
- 2nm ప్రాసెస్‌పై రూపొందించిన Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్సెట్
- లైకాతో కలిసి రూపొందించిన 200MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
- 200MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 200MP 5X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు
- 8500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో పాటు 100W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- ఫోన్‌కు IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 18 Pro Max: భారీ బ్యాటరీ, పెద్ద డిస్ప్లే, ప్రొఫెషనల్ స్థాయి కెమెరాలతో షియోమీ (Xiaomi) కొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Xiaomi 18 Pro Max పేరుతో ఈ మొబైల్ ను లాంచ్ చేశారు. 8500mAh భారీ బ్యాటరీతో పాటు 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 120Hz LTPO డిస్ప్లే, కొత్త తరం స్నాప్ డ్రాగన్ చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా వెనుక భాగంలో ప్రత్యేక సెకండరీ డిస్ప్లే ఈ ఫోన్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.
6.9 అంగుళాల LTPO డిస్ప్లే
ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో 6.9 అంగుళాల M11 12-bit OLED LTPO డిస్ప్లే ఉంది. ఇది 2624×1208 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1Hz నుంచి 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 4000 నిట్స్ బ్రైట్నెస్, HDR10+, డాల్బీ విజన్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ఇంకా ఫోన్ వెనుక భాగంలో 2.9 అంగుళాల 120Hz AMOLED సెకండరీ డిస్ప్లేను అందించారు. నోటిఫికేషన్లు, విడ్జెట్లు, యాప్ కార్డులు, చిన్న గేమ్స్ వంటి వాటిని ఈ స్క్రీన్‌పై యాక్సెస్ చేయవచ్చు. AIతో వ్యక్తిగత ఫొటోల ఆధారంగా కస్టమ్ వాల్పేపర్లను కూడా ఇందులో రూపొందించుకోవచ్చు.
స్నాప్ డ్రాగన్ చిప్సెట్
మొబైల్ పనితీరు కోసం 2nm ప్రాసెస్‌పై తయారైన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దీని గరిష్ఠ క్లాక్ స్పీడ్ 5.0GHz. Adreno 850 GPUతో పాటు 12GB, 16GB LPDDR5X RAM ఆప్షన్లు ఉన్నాయి. స్టోరేజ్ 256GB, 512GB, 1TB వేరియంట్లలో లభిస్తుంది.
లైకా 200MP ట్రిపుల్ కెమెరా సెటప్
షియోమీ18 ప్రో మాక్స్ లో లైకా (Leica)తో కలిసి రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. 200MP మెయిన్ కెమెరా, 50MP Leica అల్ట్రావైడ్ కెమెరా, 200MP 5X ఇన్ఫినిటీ లైకా పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 12 సెం.మీ. వరకు టెలిమ్యాక్రో ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేస్తుంది. 8K, 4K 120fps వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి.
8500mAh బ్యాటరీ & 100W ఛార్జింగ్
ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే.. 8500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 27W రివర్స్ వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, IP69 రేటింగ్
ఆడియో విభాగంలో ఇందులో.. ట్రిపుల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను పొందింది. డాల్బీ ఆటమ్స్, Hi-Res ఆడియో, నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి. UWB, NFC, Wi-Fi 7, బ్లూటూత్ 6.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోన్ IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
AI ఫీచర్లు
మొబైల్ HyperOS 4తో పాటు Super Xiao Ai 2.0 AI అసిస్టెంట్‌ను అందించారు. మెమరీ సేవ్ చేయడం, టాస్క్‌లను ఆటోమేటిక్‌గా ప్లాన్ చేయడం, పలు దశల పనులను నిర్వహించడం వంటి AI ఫీచర్లు ఉన్నాయి. ఇతర షియోమీ డివైజ్లతో ఫోన్ డేటాను సమన్వయం చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ధర
Xiaomi 18 Pro Max ధర చైనాలో 12GB+256GB వేరియంట్‌కు 6,999 యువాన్ల నుంచి ప్రారంభమవుతుంది. 12GB+512GB ధర 7,999 యువాన్లు, 16GB+512GB ధర 8,999 యువాన్లు, 16GB+1TB ధర 9,999 యువాన్లు. 16GB+1TB ట్రాన్స్పరెంట్ ఎడిషన్ ధర 10,999 యువాన్లు. గ్లోబల్ మార్కెట్లలో ఈ ఏడాది తర్వాత విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
తాజావార్తలు
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!