7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
- షియోమీ 18 ఫోల్డ్‌ను చైనాలో అధికారికంగా లాంచ్
- 7.58 అంగుళాల 120Hz LTPO OLED ఫోల్డబుల్ డిస్ప్లే
- బయట 5.38 అంగుళాల 120Hz LTPO OLED డిస్ప్లే
- Xiaomi XRING O3 AI ఫ్లాగ్షిప్ చిప్సెట్
- లైకాతో కలిసి అభివృద్ధి చేసిన 200MP మెయిన్ కెమెరా
- 50MP అల్ట్రా-వైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాలు కూడా
- 6000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో పాటు 67W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- ఒకేసారి ఆరు స్ప్లిట్ స్క్రీన్లను రన్ చేసే మల్టీటాస్కింగ్ ఫీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 18 Fold: షియోమీ నుండి కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 18 ఫోల్డ్ (Xiaomi 18 Fold)ను అధికారికంగా లాంచ్ చేసింది. షియోమీ నిర్వహించిన ఆటం ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్లో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. మిడ్-ఫోల్డ్ డిజైన్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ ఫోల్డబుల్ డిస్ప్లేతో పాటు శక్తివంతమైన XRING O3 చిప్సెట్, 6000mAh బ్యాటరీ, లైకా కెమెరాలు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
LTPO OLED డిస్ప్లేలు:
ఈ కొత్త ఫోల్డల్ మొబైల్ లో 5.38 అంగుళాల ఔటర్ డిస్ప్లే, 7.58 అంగుళాల ఇన్నర్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్నాయి. రెండు స్క్రీన్లు కూడా 1Hz నుంచి 120Hz వరకు డైనమిక్ LTPO రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. అలాగే గరిష్ఠంగా 4,000 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తాయి. బయటి డిస్ప్లేను వెడల్పైన హారిజాంటల్ లైన్ డిజైన్‌తో రూపొందించారు. దీంతో టైపింగ్ సమయంలో కనిపించే కీబోర్డ్ సాధారణ 6.9 అంగుళాల బార్ ఫోన్లతో పోలిస్తే 8% వెడల్పుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Also Read
- 8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
సన్నని డిజైన్..
ఫోన్‌ను తెరిచినప్పుడు 163.8×117.8×5.02 మి.మీ. పరిమాణంలో ఉంటుంది. మడిచినప్పుడు మందం 10.68 మిల్లీమీటర్లు. బరువు 219 గ్రాములుగా ఉంటుంది. నిషినో రెడ్, వార్మ్ గోల్డ్-వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే 7-సిరీస్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో పాటు షియోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 3.0ను ఉపయోగించారు. ఫోల్డింగ్ మెకానిజం కోసం కొత్త తరం “డ్రాగన్ బోన్ హింజ్” ను అందించారు. డ్యూయల్-లేయర్ అల్ట్రా-థిన్ గ్లాస్, ఫ్లెక్సిబుల్ ఇన్సులేషన్ మెటీరియల్స్‌ను కూడా ఇందులో ఉపయోగించారు. 1.2 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినప్పుడు తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
XRING O3 చిప్సెట్..
పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో కొత్త Xiaomi XRING O3 AI ఫ్లాగ్షిప్ SoCను ఉపయోగించారు. ఇది TSMC 3nm ప్రాసెస్‌పై ఆధారపడిన డెకా-కోర్ ప్రాసెసర్‌గా ఉంది. గరిష్ఠంగా 4.35GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. మల్టీ-కోర్ CPU పనితీరు 60% పెరిగిందని.. అలాగే మీడియం, తక్కువ లోడ్లలో పవర్ వినియోగం 25% తగ్గిందని షియోమీ తెలిపింది. GPU పనితీరు 85% మెరుగుపడగా, GPU పవర్ వినియోగం 64% తగ్గింది. AI పనితీరు కోసం NPU 200 TOPS టెన్సర్ కంప్యూటింగ్ పవర్, 3.13 TFLOPS వెక్టర్ కంప్యూటింగ్ పవర్‌ను అందిస్తుంది.
ఈ ఫోన్లో 12GB, 16GB RAM వేరియంట్లు ఉన్నాయి. ఇందులో LPDDR6 మెమరీని వాణిజ్యపరంగా తొలిసారిగా అందిస్తున్నట్లు షియోమీ పేర్కొంది. స్టోరేజ్ ఆప్షన్లుగా 256GB, 512GB, 1TB అందుబాటులో ఉన్నాయి. ఫోన్లో HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది.
200MP లైకా కెమెరా:
ఫొటోగ్రఫీ కోసం Xiaomi 18 Foldలో లైకా (Leica)తో కలిసి అభివృద్ధి చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో OISతో కూడిన 200MP మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేసే 50MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. టెలిఫొటో కెమెరాలో f/2.8 అపెర్చర్, OIS, Leica Summilux లెన్స్‌ను అందించారు. 8K వీడియో రికార్డింగ్‌కు కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇన్నర్, ఔటర్ డిస్ప్లేల్లో 16MP ఫ్రంట్ కెమెరాలను అందించారు.
బ్యాటరీ..
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 6000mAh కెపాసిటీ కలిగిన డ్యూయల్-లేయర్ Xiaomi Jinshajiang సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇందులో 20% సిలికాన్ కంటెంట్ ఉండగా, 920Wh/L ఎనర్జీ డెన్సిటీని అందిస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోల్డబుల్ ఫోన్‌కు తగినట్లుగా బ్యాటరీ సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

మల్టీటాస్కింగ్..
పెద్ద ఫోల్డబుల్ డిస్ప్లేను ఉపయోగించుకునేలా షియోమీ మల్టీటాస్కింగ్ ఫీచర్లను మెరుగుపరిచింది. ఒకేసారి ఆరు స్ప్లిట్ స్క్రీన్ల వరకు రన్ చేసే అవకాశం ఉంది. అలాగే “Super Xiao Ai Inspiration Ball” ద్వారా వాయిస్ కమాండ్లతో వివిధ పనులను నిర్వహించవచ్చు.
సిరామిక్ లిమిటెడ్ ఎడిషన్:
Xiaomi 18 Foldతో పాటు ప్రత్యేక “సిరామిక్ ఎడిషన్” ను కూడా కంపెనీ పరిచయం చేసింది. సిలికాన్ నైట్రైడ్ సిరామిక్‌తో తయారు చేసిన ఈ ఎడిషన్ తక్కువ బరువు, అధిక ఉపరితల కాఠిన్యం లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక వేరియంట్ కేవలం 16GB LPDDR6 RAM, 1TB స్టోరేజ్‌తో మాత్రమే లభిస్తుంది. మొత్తం 1,500 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
ధర:
Xiaomi 18 Fold ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటల నుంచి చైనాలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఈ ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై ప్రస్తుతానికి సమాచారం లేదు. చైనాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి.
* 12GB + 256GB: 10,999 యువాన్ — రూ.1.55 లక్షలు.
* 12GB + 512GB: 11,999 యువాన్ — రూ.1.69 లక్షలు.
* 16GB + 512GB: 12,999 యువాన్ — రూ.1.83 లక్షలు.
* 16GB LPDDR6 + 1TB: 14,999 యువాన్ — రూ.2.11 లక్షలు.
* 16GB LPDDR6 + 1TB Ceramic Edition: 15,999 యువాన్ — రూ.2.25 లక్షలు.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!