Site icon NTV Telugu

Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 200MP లైకా కెమెరాతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర ఎంతంటే..?

Xiaomi 17 Ultra

Xiaomi 17 Ultra

Xiaomi 17 Ultra: షియోమీ (Xiaomi) ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో నాలుగో మోడల్‌గా షియోమీ 17 అల్ట్రా (Xiaomi 17 Ultra)ను తాజాగా చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Xiaomi 15 Ultraకు వారసుడిగా ఈ మొబైల్ ను తీసుకవచ్చింది. బ్యాటరీ, ప్రాసెసర్, పనితీరు, కెమెరాల పరంగా పాత మోడల్‌తో పోలిస్తే అనేక కీలక అప్‌గ్రేడ్స్‌ను ఈ ఫోన్ అందిస్తోంది. ఈ కొత్త Xiaomi 17 Ultraలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Qualcomm Snapdragon 8 Elite Gen 5) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm ప్రాసెస్ పై తయారైన ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్.

12.1 అంగుళాల 120Hz డిస్‌ప్లే, Dimensity 7300-Ultra చిప్‌సెట్, 10,050mAh బ్యాటరీతో Oppo Pad Air 5 లాంచ్..!

ఇక కెమెరా విభాగంలో లైకా ట్యూన్ చేసిన రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. షియోమీ 17 Ultra బేస్ వేరియంట్‌లో 12GB RAM + 512GB స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర CNY 6,999గా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 90,000 గా ఉంటుంది. ఇక 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 7,499 (రూ. 96,000) కాగా.. టాప్ వేరియంట్ అయిన 16GB RAM + 1TB స్టోరేజ్ మోడల్ ధర CNY 8,499 (రూ. 1,09,000) గా నిర్ణయించారు.

Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోడీ..

ఈ డివైస్‌లో భారీ సామర్థ్యం గల 6800mAh Jinshajiang బ్యాటరీను అందించారు. 90W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 27 నుంచి చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఇది బ్లాక్, వైట్, పింక్, స్టారీ స్కై గ్రీన్ అనే నాలుగు రంగుల్లో లభించనుంది.

Exit mobile version