SIM Card Mystery: సిమ్ కార్డ్ మిస్టరీ.. ప్రతి సిమ్ కార్డ్ మూల ఎందుకు తెగిపోయి ఉంటుంది.?
- సిమ్ కార్డు ఎందుకు మూల కట్ ఉంటుంది?
- వినియోగదారుల గందరగోళం తగ్గించడానికి తీసుకున్న నిర్ణయం
- ఫోన్ హార్డ్‌వేర్‌ను రక్షించే కీలక డిజైన్
- క్రెడిట్ కార్డు సైజు నుండి నానో వరకు వచ్చిన ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఫోన్ ఎంత ఖరీదైనదైనా, అందులో ఉండే ఒక చిన్న ‘సిమ్ కార్డు’ (SIM Card) లేకపోతే అది కేవలం ఒక డబ్బా ముక్కతో సమానం. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీకి చెందిన సిమ్ కార్డు అయినా ఒక మూలలో కట్ చేసి ఉంటుంది. ఇది కేవలం స్టైల్ కోసం చేసిన డిజైన్ అనుకుంటే పొరపాటే! దీని వెనుక ఒక బలమైన సాంకేతిక కారణం ఉంది. ఆ ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
Nithin- VI Anand: ‘నో బాడీ.. నో రూల్స్’.. కాన్సెప్ట్‌తో నితిన్ నెక్స్ట్ మూవీ పోస్టర్ రిలిజ్..
గందరగోళానికి చెక్ పెట్టేందుకే..
Also Read
- OnePlus 16 లీక్స్ వైరల్.. 9,000mAh భారీ బ్యాటరీ, సరికొత్త ఫీచర్లతో భారీ అంచనాలు..
- Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
- రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
- 15 నెలల వ్యాలిడిటీతో Jio 'Freedom Pack'.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
మొదట్లో సిమ్ కార్డులు పూర్తి దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. అంటే నాలుగు వైపులా మూలలు సమానంగా ఉండేవి. దీనివల్ల వినియోగదారులు సిమ్ కార్డును ఫోన్లో పెట్టేటప్పుడు అది ఏ వైపు పెట్టాలో తెలియక తరచూ గందరగోళానికి గురయ్యేవారు. పొరపాటున సిమ్ రివర్స్‌లో పెడితే ఫోన్ పని చేయకపోవడమే కాకుండా, చిప్‌పై గీతలు పడి అది పాడైపోయేది. ఈ సమస్యను పరిష్కరించడానికి టెలికాం కంపెనీలు సిమ్ కార్డుకు ఒక మూల కట్ చేయాలని నిర్ణయించాయి. ఆ కట్ ఆధారంగా సిమ్ ఏ దిశలో పెట్టాలో యూజర్లకు సులభంగా అర్థమవుతుంది.
ఫోన్ హార్డ్‌వేర్ రక్షణ కోసం
సిమ్ కార్డు మధ్యలో ఉండే గోల్డెన్ చిప్, ఫోన్లోని సిమ్ రీడర్ పిన్స్‌కు సరిగ్గా టచ్ అవ్వాలి. ఒకవేళ సిమ్ కార్డును తప్పు దిశలో పెట్టి బలవంతంగా లోపలికి నొక్కితే, ఫోన్ లోపల ఉండే సెన్సిటివ్ పిన్స్ విరిగిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ రిపేర్ ఖర్చులతో పాటు, సిమ్ కార్డు కూడా పనికిరాకుండా పోతుంది. అందుకే ఆ కట్ ఒక ‘సేఫ్టీ గైడ్’లా పనిచేస్తూ, కార్డును కేవలం ఒకే ఒక సరైన దిశలో లోపలికి వెళ్లేలా చేస్తుంది.
క్రెడిట్ కార్డు సైజు నుండి నానో స్థాయికి..
మీకు తెలుసా? 1990వ దశకంలో సిమ్ కార్డులు మన ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండేవి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఫోన్లు స్లిమ్‌గా మారాయి, దాంతో సిమ్ కార్డులు కూడా చిన్నవిగా మారుతూ వచ్చాయి. మినీ సిమ్, మైక్రో సిమ్, నానో సిమ్.. ఇలా సైజులు మారినా, ఆ ‘కట్ కార్నర్’ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇది ఇప్పుడు ఒక గ్లోబల్ స్టాండర్డ్ డిజైన్‌గా మారిపోయింది. మనం చాలా సాధారణంగా చూసే ఈ చిన్న కట్ వెనుక ఇంత పెద్ద టెక్నికల్ లాజిక్ ఉందన్నమాట. కేవలం ఒక మూల కట్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల శ్రమ, సమయం , వారి ఖరీదైన ఫోన్లు సురక్షితంగా ఉంటున్నాయి.
తాజావార్తలు
-
CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
-
Tati Garelu: నోరూరించే సంప్రదాయ వంటకం..’తాటి గారెలు’ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తయారు చేసుకోండి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
-
CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
-
Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలో ‘కుటుంబ రిజిస్టర్’
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!