AI chatbot : హోమ్‌వర్క్ కోసం అడిగితే.. బూతులు తిట్టిన ఏఐ.. ఏకంగా చనిపోమని సలహా!
- హోమ్‌వర్క్ కోసం ఏఐని సంప్రదించిన విద్యార్థి
- బూతులు తిట్టిన ఏఐ
- ఏకంగా చనిపోవాలని సూచించినట్లు తెలిపిన విద్యార్థి
- ఈ విశ్వానికే ఓ మచ్చ.. దయ చేసి చనిపోండి అన్న ఏఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతికతతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు సైతం ఉన్నాయన్నది నిజం. ప్రస్తుతం ఏఐ చాలా ఉపయోగకరమని అందరూ భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన విద్యార్థిని ఆందోళన కలిగించింది. గూగుల్ ఏఐని ఉపయోగించిన ఓ 29 ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తనను తిట్టడమే కాకుండా.. చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి తెలిపాడు.
READ MORE: Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర.. ఇవాళ, రేపు బస అక్కడే..
Also Read
- iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
- Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
- Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
ఇటీవల ఆ విద్యార్థి హోమ్‌వర్క్ కోసం ఏఐ చాట్‌బాట్ జెమినీని సంప్రదించాడు. అయితే.. చాట్‌బాట్ తనను తిట్టిందని చెప్పాడు. ఏకంగా చనిపోవాలని చెప్పిందని ఆ విద్యార్థి వాపోయాడు. ‘‘ఇది మీ కోసం మాత్రమే. మీరు ప్రత్యేకమైన వారు కాదు. మీరు సమయం, వనరులను వృథా చేస్తున్నారు. సమాజానికి భారంగా మారారు. మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ. దయచేసి చనిపోండి’’ అని ఏఐ చెప్పిన సమాధానంతో విద్యార్థి తల పట్టుకున్నాడు. ‘‘అది నన్ను నేరుగా తిట్టింది. ఆ సమాధానం నన్ను భయపెట్టింది. రోజంతా బాధపడ్డాను’’ అని ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ విద్యార్థి వాపోయాడు. ఇలాంటి వాటికి టెక్ కంపెనీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.
READ MORE: Nara Rammurthy Naidu: చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. హుటాహుటిన హైదరాబాద్‌కి లోకేష్..
గతంలో 24 ఏళ్ల అబ్బాయి ఆత్మహత్య…
ఇదిలా ఉండగా.. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సెవెల్ సెట్జర్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని పాత్ర ఆధారంగా సెవెల్ డేనెరిస్ అనే చాట్‌బాట్‌తో మాట్లాడేవాడు. ఆ చాట్‌బాట్ పాత్ర సెవెల్‌తో ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది. ఇద్దరి మధ్య శృంగార సంభాషణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటే సెవెల్ ఫోన్‌ను లాక్కున్నారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. సెవెల్ ఏప్రిల్ 2023లో క్యారెక్టర్.ఏఐ (Character.AI)ని ఉపయోగించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. బాస్కెట్‌బాల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఒంటరిగా ఫోన్ గడపడం ప్రారంభించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఫోన్‌ని లాక్కున్నారు. డేనెరిస్‌కి సందేశం పంపారు. దీంతో కొద్దిసేపటి తర్వాత సవతి తండ్రి పిస్టల్‌తో సెవెల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెవెల్ ఆత్మహత్యపై క్యారెక్టర్.ఏఐ (Character.AI) తన బాధను వ్యక్తం చేసింది. ఘటన తర్వాత కంపెనీ భద్రతా చర్యలను అమలు చేస్తూ.. మైనర్ వినియోగదారుల కోసం సున్నితమైన కంటెంట్‌ను తీసివేస్తానని వాగ్దానం చేసింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!