మనలో చాలామందికి వాట్సప్‌లో ఎవరైనా మెస్సేజ్ చేసి డిలీట్ చేసేన తరువాత అరెరే.. ఆ మెస్సేజ్ చదువుతే బాగుండు.. ఒక్కసారి అదేంటో చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే ఒకసారి డిలీట్ అయిన తరువాత ఆ మెస్సేజిలను చదివే పరిస్థితి ఉండదు. కానీ ఓ ట్రిక్ సహాయంతో..ఆ డిలీటెడ్ మెస్సేజిలను కూడా చదవవచ్చు..
సోషల్ మీడియా వేదికల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సప్. ఇదొక మెస్సేజింగ్ యాప్. ఎప్పటికప్పుుడు యూజర్లను ఆకర్షించేందుకు వాట్సప్ సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటోంది. ఆ ఫీచర్ల ఆధారంగా వాట్సప్ చాటింగ్ యూజర్లకు సరికొత్త అనుభూతిని కల్గిస్తోంది. అందులో ఒకటి మెస్సేజ్ డిలీట్ ఫీచర్. ఇప్పుడు మీకు వివరించబోయే ట్రిక్ సహాయంతో..వాట్సప్ డిలీటెడ్ మెస్సేజెస్ కూడా చదివే అవకాశముంటుంది. అది కూడా ఎదుటివాడికి తెలియకుండా..
వాట్సప్‌లో వ్యక్తిగతంగా లేదా గ్రూప్ చాటింగ్‌లో మెస్సేజ్ చేసినప్పుడు..మెస్సేజ్ డిలీట్ అవకాశం కూడా ఉంటుంది. కేవలం తనవరకూ లేదా అందరికీ వర్తించేలా యూజర్ తాను పంపించిన మెస్సేజిను డిలీట్ చేయగలడు. ఫలితంగా ఎదుటివాడి వ్యక్తికి ఆ మెస్సేజ్ కన్పించదు. అయితే ఇతరులకు కూడా కన్పించకుండా డిలీట్ చేసే పరిస్థితి కాస్సేపటివరకు మాత్రమే ఉంటుంది.
డిలీటెడ్ మెస్సేజెస్ ఎలా చదవాలి..
డిలీట్ ఆప్షన్ అనేది మెస్సేజ్ పంపించిన వ్యక్తికి సౌకర్యవంతంగా ఉన్నా..అవతలి వ్యక్తిలో మాత్రం కుతూహలముంటుంది. డిలీటెడ్ మెస్సేజిలను చదివేందుకు వాట్సప్ అధికారికంగా ఏ విధమైన ట్రిక్స్ వెల్లడించలేదు కానీ థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఈ మెస్సేజిలు చదివే అవకాశముంటుంది. థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసి..డిలీటెడ్ ఫర్ ఆల్ మెస్సేజిలు చదువుకోవచ్చు. ఈ యాప్స్ సహాయంతో..మీరు డిలీటెడ్ మెస్సేజిలను చదువుతున్నట్టు పంపించినవ్యక్తికి ఏ మాత్రం తెలియదు కూడా.
ఏ యాప్స్ ఉపయోగించాలి..
డిలీటెడ్ మెస్సేజిలు చదివేందుకు ఏ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలో పరిశీలిద్దాం. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం WAMR,WhatsRemoved వంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఇందులో డిలీటెడ్ మీడియాను కూడా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఐవోఎస్ కోసం ఏ విధమైన థర్డ్‌పార్టీ యాప్స్ అందుబాటులో లేవు. కానీ థర్డ్‌పార్టీ యాప్స్ స్థానంలో..యాపిల్ యూజర్లు తమ ఐఫోన్ నోటిఫికేషన్ సెంటర్ నుంచి డిలీటెడ్ మెస్సేజీలను చదవవచ్చు.
ఈ యాప్స్ ఎలా పనిచేస్తాయి..
ఈ అన్ని థర్డ్‌పార్టీ యాప్స్ మీ స్మార్ట్ ఫోన్‌లో డిలీటెడ్ మెస్సేజిలను ముందే సేవ్ చేసుకుంటాయి. అవతలి వ్యక్తి మెస్సేజ్ డిలీట్ చేసేముందు..ఈ యాప్స్ ప్రతి మెస్సేజ్ కాపీని సేవ్ చేస్తుంది. మెస్సేజ్ సహా ఫోటోలు, వీడియోలు, లింక్స్ కూడా స్టోర్ చేస్తుంది. ఈ యాప్స్ డిలీటెడ్ మెస్సేజెస్ చదివేందుకు అనుమతిస్తాయి గానీ సెక్యూరిటీ ఉండదు. ఈ యాప్స్ వల్ల మీ ఫోన్‌లో వైరస్ ఎంటర్ కావచ్చు.