ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కస్టమర్ల సౌలభ్యమే ప్రధాన లక్ష్యంగా సాగే ఈ యాప్ మరోసారి సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్‌లను యూజర్లకు పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ తాజాగా మరొక ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా చాట్ బ్యాకప్ కష్టాలకు చెక్ పెట్టొచ్చు. ఈజీగా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పించనుంది. ఇందుకోసం వాట్సాప్ త్వరలోనే చాట్ ట్రాన్స్‌ఫర్ అనే ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందన్న విషయాల గురించి చూద్దాం.
Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు
ఈ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ ద్వారా యూజర్లు సులువుగా మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే చాట్ హిస్టరీని ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మరో ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కేవలం లోకల్ నెట్‌వర్క్ ద్వారానే ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ చేయవచ్చు. అయితే వాట్సాప్ సంస్థ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని తీసుకురానుంది. క్యూఆర్ కోడ్ ద్వారా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయగలిగేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. యూజర్లు తమ డేటాను ఏ స్మార్ట్‌ఫోన్‌కు సెండ్ చేయాలని అనుకుంటున్నారో ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌ను స్కా్న్ చేస్తే సరిపోతుంది. దీంతో ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నుంచి చాట్ హిస్టరీ కొత్త డివైజ్‌లోకి బదిలీ అవుతుంది.
భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..
వాట్సాప్ మెసేజ్‌లను భద్రపరుచుకోవాలి అంటే బ్యాకప్ చేయాలి. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అయితే ఇకపై అటువంటి ఇబ్బందులు ఉండవు. చాట్ ట్రాన్స్‌ఫర్’ దీనికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. యూజర్లు తమ డేటాను డ్రైవ్‌లోకి, క్లౌడ్ సర్వీసుల్లోకి అప్‌లోడ్ చేయాల్సిన పని ఉండదు. కేవలం వేరే డివైజ్‌ల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు, వేరే ఫోన్‌లో వాట్సాప్ లాగిన్ అయినప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది.