భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
1946 డిసెంబర్ 11వ తేదీన రాజ్యాంగ పరిషత్ సమావేశం జరిగింది. దీనిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నియ్యారు.
భారత రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా రాశారు. ఇటాలిక్ శైలిలో రాసిన రాజ్యాంగంలోని ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అలంకరించారు.
రాజ్యాంగసభ సభ్యుల మొదటి సెషన్ 1947 డిసెంబర్ 9న జరిగింది. ఈ సమయంలో రాజ్యాంగ పరిషత్‌లో 207 మంది సభ్యులు ఉన్నారు. ఆ సమయంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అంబేడ్కర్ ఛైర్మన్‌గా ఉన్నారు.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశాలు 114 రోజుల పాటు కొనసాగాయి. రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది.
రాజ్యాంగ నిర్మాణ పనులకు దాదాపు 64 లక్షల రూపాయలు వెచ్చించారు.
రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు.
రాజ్యాంగ ఆత్మగా పిలవబడే భారత రాజ్యాంగ పీఠికను అమెరికన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.
1950 జనవరి 26న అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఆమోదించారు.
సెక్యులర్ అనే పదాన్ని 42వ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
భారత రాజ్యాంగం అసలు కాపీని చేతితో రాశారు. ఈ కాపీ పార్లమెంటు భవనంలోని లైబ్రరీలోని నైట్రోజన్ గ్యాస్ ఛాంబర్‌లో భద్రంగా ఉంచారు.