WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: పాత స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారికి వాట్సాప్ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 8, 2026 నుంచి కొన్ని పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని Wabetainfo తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 5.0, 5.1 (లాపాప్) వెర్షన్లతో నడిచే ఫోన్లలో ఇకపై ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ అందుబాటులో ఉండదు. ఈ పాత ఫోన్ల వినియోగదారులు యాప్ ఓపెన్ చేయగానే, వారి సేవలు నిలిచిపోయినట్లు ఒక అలర్ట్ నోటిఫికేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి వినియోగదారులకు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది, మీ ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్ ఉంటే వెంటనే దానిని కొత్త వర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ హ్యాండ్‌సెట్‌కు కంపెనీ తదుపరి అప్డేట్స్ ఇవ్వకపోతే, వాట్సాప్ వాడటానికి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడం మినహా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇకపై వాట్సాప్ సేవలను పొందాలంటే ఫోన్లో కనీసం ‘ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మెల్లో’ లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం తప్పనిసరి.
నిజానికి వాట్సాప్ ఈ నిర్ణయాన్ని అకస్మాత్తుగా ఏమీ తీసుకోలేదు. పాత ఫోన్లలో సపోర్ట్ నిలిపివేస్తున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్తాన్, బ్రెజిల్ వంటి అనేక దేశాల్లో నేటికీ ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే పాత వర్షన్లపై పనిచేసే స్మార్ట్ఫోన్లను భారీ సంఖ్యలోనే ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం ఆయా దేశాల్లోని అనేకమంది యూజర్లపై నేరుగా ప్రభావం చూపనుంది. భద్రతతో పాటు వినియోగదారులకు ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లను అందించడానికే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. యాప్‌లో తీసుకొచ్చే కొత్త సెక్యూరిటీ అప్డేట్స్, సరికొత్త ఫీచర్లు చాలా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సాంకేతికంగా సపోర్ట్ చేయవు. అందుకే యూజర్లకు మెరుగైన, సురక్షితమైన అనుభవాన్ని అందించే క్రమంలో వాట్సాప్ కాలానుగుణంగా ఇలాంటి పాత ఆండ్రాయిడ్ వెర్షన్లకు సపోర్ట్‌ను నిలిపివేస్తూ ఉంటుంది.
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!