Site icon NTV Telugu

WhatsAppలో నయా ఫీచర్ ఆగయా.. ఇకపై మీకు నచ్చిన భాషలో మెసేజ్స్

Whatsapp

Whatsapp

WhatsApp: మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌, ప్రపంచవ్యాప్తంగా యూజర్లు సులభంగా సంభాషించుకునేందుకు వీలుగా ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ప్రవేశపెట్టిన ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్, సంభాషణల (మెసేజ్స్) మధ్య ఉన్న భాషా అంతరాలను తగ్గించనుంది. చాట్‌లలో వచ్చే సందేశాలను యూజర్లు తమకు నచ్చిన భాషలో చదువుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది.

Group 1 Mains Exam: గ్రూప్-1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట.. సింగిల్‌ బెంచ్‌ తీర్పు సస్పెండ్‌

వాట్సప్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ సంభాషణలతో పాటు ఛానల్ అప్‌డేట్స్‌లో కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. మొదట ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఇంగ్లిష్, స్పానిష్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, అరబిక్ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఐఓఎస్‌లో మాత్రం ఏకంగా 19కు పైగా భాషలకు మద్దతు లభిస్తుంది.

అసలు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందన్న విషయానికి వస్తే.. యూజర్లు ఒక సందేశాన్ని అనువదించాలనుకుంటే, ఆ సందేశంపై కాసేపు నొక్కి ఉంచాలి. అప్పుడు కనిపించే కొత్త ‘ట్రాన్స్‌లేట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత, వారు ఏ భాషలోకి అనువదించాలనుకుంటున్నారో ఆ భాషను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు కావాలనుకుంటే, మొత్తం చాట్ థ్రెడ్‌కు ఆటోమేటిక్ అనువాదాలను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే సందేశాలన్నీ మాన్యువల్ గా మార్చాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా అనువాదం అవుతాయి.

విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే?

ఈ అనువాద ప్రక్రియ యూజర్ డివైస్‌లోనే జరుగుతుందని వాట్సప్ స్పష్టం చేసింది. దీని వల్ల సంభాషణల గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందని, వాట్సప్ కూడా ఆ సందేశాలను చదవబోదని కంపెనీ పేర్కొంది. ఈ మధ్యకాలంలో వాట్సప్‌లో AI ఆధారిత ఫీచర్‌లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా దానిలో భాగమేనని కంపెనీ తెలిపింది. ఇది ‘రైటింగ్ హెల్ప్’ వంటి AI ఆధారిత ఫీచర్ల కొనసాగింపుగా చెప్పవచ్చు. దీని వల్ల యూజర్లు తమ సందేశాలను మరింత మెరుగ్గా రాసుకోవడానికి, అలాగే వచ్చిన సందేశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని భాషలకు ఈ అనువాద సదుపాయం విస్తరించే అవకాశం లేకపోలేదు.

Exit mobile version