NTV Telugu Site icon

WhatsApp voice message transcripts: వాట్సాప్ నుంచి క్రేజీ ఫీచర్.. యూజర్లకు ఇకపై ఆ టెన్షనే ఉండదు!

Watsaap

Watsaap

ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారందరు వాట్సాప్ ను కలిగి ఉన్నారు. వాట్సాప్ చూడకుండా గంటలు కూడా గడపలేరు. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. సేవలను ఈజీగా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. తాజాగా వాట్సాప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్ లోని యూజర్ల కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను ప్రారంభించింది. ఈ ఫీచర్ సహాయంతో వాయిస్ మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. అంటే వినడం అవసరం లేకుండా చదవగలుగుతారు.

Also Read:Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్‌‌పై అన్నామలై ఆగ్రహం..

వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ల రూపంలో సమాచారం చేరవేస్తుంటారు. అయితే వాయిస్ మెసేజ్ లు ఎక్కువ మంది ఉన్నచోట వినలేము. ఎందుకంటే అది గోప్యతకు సంబంధించిన సమాచారం అయిఉండొచ్చు. సౌండ్ పొల్యూషన్ ఉన్నచోట కూడా వాయిస్ మెసేజ్ లను వినలేము. ఇయర్ ఫోన్స్ ఉన్నప్పుడు వినే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఇయర్ ఫోన్స్ లేకపోతే ఆ వాయిస్ మెసేజ్ లను వినే పరిస్థితులు లేక అందులో ఏముందో తెలుసుకోలేక టెన్షన్ పడుతుంటారు. ఇక ఇప్పుడు ఆ టెన్షన్ కు చెక్ పడినట్లే. వాట్సాప్ తీసుకొచ్చిన వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్‌ తో టెక్ట్స్ గా మార్చుకోవచ్చు. బహిరంగంగా వాయిస్ మెసేజ్ లను వినాల్సిన అవసరం లేదు.

Also Read:Vallabhaneni Vamshi: రెండో రోజు ముగిసిన వంశీ విచారణ.. 3 గంటలకు పైగా ప్రశ్నలు

వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్‌ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అధికారికంగా ఈ ఫీచర్‌లో ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ ,రష్యన్ భాషలు ఉన్నాయి. ఈ ఫీచర్ ను సెట్టింగ్‌లలో వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఆప్షన్ కు వెళ్లడం ద్వారా దీన్ని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు.

Also Read:Jharkhand: ‘‘శివరాత్రి’’ డెకరేషన్‌పై రాళ్ల దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..

వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్ట్‌లను ఎలా యాక్టివేట్ చేయాలంటే?

ముందుగా వాట్సాప్ సెట్టింగ్‌లకు వెళ్లి చాట్స్‌పై క్లిక్ చేయాలి. తరువాత, వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ పై క్లిక్ చేసి ప్రారంభించొచ్చు. తర్వాత భాషను ఎంచుకోవాలి. చివరగా సెటప్ నౌ అండ్ వెయిట్ ఫర్ వై-ఫై అనే ఆప్షన్ వస్తుంది. సెటప్ పూర్తయిన తర్వాత, చాట్‌లోని ఏదైనా వాయిస్ మెసేజ్ ను నొక్కి ఉంచి, మోర్ ఆప్షన్ లోకి వెళ్లి, ట్రాన్స్‌క్రైబ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు వాయిస్ మెసేజ్ టెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్ వాయిస్ నోట్ బాక్స్‌లోనే కనిపిస్తుంది.