WhatsApp: వాట్సాప్ ఛానెల్స్ ను ఎలా హైడ్ చెయ్యాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ఎక్కువ మంది వాడుతున్నారు.. ఇక వాట్సాప్ కూడా తన కస్టమర్లకు సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తున్నారు.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్స్‌ను తీసుకొస్తోందీ కాబట్టే ఈ మెసేజింగ్ యాప్‌కు ఇంతటీ ఫాలోయింగ్ ఉంది.. మార్కెట్ లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సైట్స్ నుంచి వస్తున్న పోటీ తట్టుకోనేందుకు వీలుగా వాట్సాప్ ఛానెల్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది..
‘వాట్సాప్ ఛానెల్స్’ పేరుతో తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫీచర్ సహాయంతో సెలబ్రిటీలు మొదలు పలు ప్రముఖ సంస్థల వరకు వాట్సాప్ ఛానెల్స్‌ను క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఛానెల్స్ సహాయంతో తమ అభిప్రాయాలను కానీ, తమ సంస్థ ప్రొడక్ట్స్‌ను కానీ ప్రమోట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.. దాంతో ఎక్కువ మంది వాట్సాప్ ఛానెల్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.. ఇక జనాల నుంచి కూడా మంచి ఆదరణ ను అందుకున్నాయి. అయితే ఈ కొత్త ఫీచర్ కొందరికి మాత్రం చిరాకు తెచ్చి పెడుతోంది. పర్సనల్ చాట్స్ చేసుకునే చోట ఈ ఛానెల్స్ గొడవ ఏంటనే అభిప్రాయం కూడా మరోవైపు వినిపిస్తుంది..
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
అలాంటివారికి వాట్సాప్ ఉపశమనం కల్పిస్తుంది.. వాట్సాప్ ఛానల్ ఫీచర్‌తో ఇబ్బంది పడుతోన్న వారికి సదరు ఫీచర్‌ను హైడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వాట్సాప్ ఛానల్స్ ఫీచర్‌ను హైడ్ చేయడం కోసం ముందుగా.. వాట్సాప్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘అప్‌డేట్స్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్ చేస్తే ఛానల్స్ కనిపిస్తాయి. అయితే మీ వాట్సాప్‌లో ఒకవేళ సరిపడ స్టేటస్‌లు ఉంటే ఆటోమెటిగ్‌గా ఛానెల్స్ చివరికి వెళ్లిపోతాయి.. మళ్లీ వాట్సాప్ ఓపెన్‌చేసి ప్రతీసారి ఛానల్స్ కనిపిస్తాయి..వాట్సాప్ ఛానల్స్ కనిపించకుండా చేయడానికి మరో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీరు వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేయకుండా ఉన్నట్లైనా ఛానెల్స్ కనిపించవు. పాత వెర్షన్‌ను వినియోగించుకోవడం ద్వారా ఛానెల్స్ గొడవ లేకుండా ఉండొచ్చు.. పాత వెర్షన్ ను బ్యాకప్ తీసుకొని మీరు మళ్ళా ముందులా చాట్ ను చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!