NTV Telugu Site icon

WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. మీ అకౌంట్స్ జాగ్రత్త!

Whatsapp

Whatsapp

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. వీటిలో 13.27 లక్షల ఖాతాలను వినియోగదారు నివేదిక లేకుండానే నిషేధించారు. కంపెనీ ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ భద్రతను బలోపేతం చేయడానికి, స్పామ్, స్కామ్‌లను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నారు.

ఈ ఖాతాలను ఎందుకు నిషేధించారు?
నిషేధించిన ఖాతాలు 2021 ఐటీ నిబంధనలను ఉల్లంఘించాయని వాట్సాప్ తెలిపింది. స్పామ్, చట్టవిరుద్ధ సందేశాలను పంపడం, మోసాలు, నకిలీ వార్తలను షేర్ చేయడం, తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం, చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా మోసపూరిత లావాదేవీలతో సంబంధం కలిగి ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వాట్సప్ అకౌంట్‌ను పూర్తిగా నిలిపి వేసినట్లు వాట్సాప్ తెలిపింది.

వాస్తవానికి.. వాట్సాప్ మూడు అంచెల భద్రతా వ్యవస్థను స్వీకరించింది. ఇందులో ఈ దశలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఖాతా ధృవీకరించడం. అనుమానాస్పద ఖాతాలు బ్లాక్ చేయండం. స్పామ్, అనుమానాస్పద సందేశాలను పంపే ఖాతాలు ట్రాక్ చేసి నిలిపేయడం. ఏదేనీ ఓ వినియోగదారు ఒక ఖాతాను బ్లాక్ చేస్తే.. ఆ అకౌంట్‌ను నిషితంగా పరిశీలించి నిలిపేస్తారు. మీ వాట్సాప్ ఖాతా బ్లాక్ కాకుండా ఉండాలంటే.. ఈ నియమాలు పాటించాలి. స్పామ్, బల్క్ మెసేజింగ్ మానుకోండి. తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని నివారించండి. ఏదైనా అనుమానాస్పద మెసేజ్ వస్తే.. వెంటనే అప్రమత్తం అవ్వండి.