భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!

Vivo X500

Vivo X500

Vivo X500 Series India Launch: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్లోకి తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ Vivo X500 సిరీస్ త్వరలో భారత్‌లో విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా టీజర్ విడుదల చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ సిరీస్‌లో ZEISS కెమెరా టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘ZEISS Cinematics. Create Further’ అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ఈ ఫోన్లను ప్రమోట్ చేస్తోంది.

ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌గా ఉండనున్న Vivo X500 Pro Max కోసం ప్రత్యేకంగా ZEISS Telephoto Extender Gen 2 Ultra లెన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఎక్స్‌టర్నల్ లెన్స్ సహాయంతో 400mm ఈక్వివలెంట్ ఫోకల్ లెంగ్త్‌ను పొందవచ్చు. ఫోన్‌లోని కెమెరా యాప్ ద్వారా ఈ లెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్రత్యేక యాక్సెసరీ Vivo X500 Pro Maxకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో పాటు కాకుండా విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ పరంగా Vivo X500 సిరీస్‌లో కొత్త OriginOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆధారంగా రూపొందించిన వివో సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్. ఇందులో కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు Vivo Watch GT2 స్మార్ట్‌వాచ్‌ను కూడా భారత మార్కెట్లోకి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ విడుదల చేసిన ప్రమోషనల్ పోస్టర్‌లో ఈ వాచ్‌ను కూడా ప్రదర్శించింది. అయితే స్మార్ట్‌ఫోన్‌తో పాటు వాచ్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు వీటిని విడివిడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

డిజైన్ విషయానికి వస్తే Vivo X500 సిరీస్ ఫోన్లలో వెనుకవైపు పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో పలు అధునాతన కెమెరా సెన్సార్లు, ZEISS T* యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉన్నాయి. కర్వ్డ్ మెటాలిక్ ఫ్రేమ్‌తో పాటు ఆకర్షణీయమైన ఎర్త్ టోన్ కలర్ ఫినిషింగ్‌ను అందించారు. వివో ఇప్పటివరకు భారత లాంచ్ తేదీ, ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే తాజా నివేదికల ప్రకారం 2026 నవంబర్ చివరి వారంలో ఈ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అధికారిక లాంచ్ ఈవెంట్‌లోనే ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లపై స్పష్టత రానుంది.