Vivo V60e: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (vivo) తన కొత్త V60e స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. V60 సిరీస్లో భాగంగా ఈ ఫోన్ విడుదల అయ్యింది. స్టైలిష్ డిజైన్, మంచి పనితీరు, అలాగే ఆధునిక AI ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుంది. vivo V60eలో 6.77 అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ సాంప్లింగ్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 1900 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఈ డిస్‌ప్లే మరింత స్ట్రాంగ్ గా తయారు చేయబడింది. కంపెనీ ప్రకారం ఇది ముందు మోడల్ కంటే 37% మెరుగైన డ్రాప్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
ఈ ఫోన్ MediaTek Dimensity 7360 Turbo (4nm) చిప్‌సెట్‌తో నడుస్తుంది. దీన్ని 8GB లేదా 12GB ర్యామ్.. అలాగే 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్లలో పొందవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఉన్న Funtouch OS 15 పై రన్ అవుతుంది. ఈ మొబైల్ కు కంపెనీ 3 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తుందని తెలిపింది.AI ఆధారిత ఫీచర్లు కూడా ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిలో భాగంగా సర్కిల్ టు సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్సలేషన్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, ఎరేజ్ 2.0 వంటి ఫీచర్లు వినియోగదారులకు స్మార్ట్ అనుభవాన్ని అందిస్తాయి.
రూ.3,999కే టచ్ అండ్ గో డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ అనుభవం ఇచ్చే HMD Touch 4G లాంచ్!
ఇక ఫోటోగ్రఫీ కోసం, vivo V60eలో 200MP ప్రైమరీ కెమెరా (Samsung HP9 సెన్సార్, f/1.88)తో పాటు OIS సపోర్ట్ ఉంది. అలాగే 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, Aura లైట్ సిస్టమ్ ఉన్నాయి. ఇక ముందు భాగంలో 50MP ఐ ఆటోఫోకస్ కెమెరా (f/2.0) లభిస్తుంది. ఈ ఫోన్‌లో భారతదేశంలోనే తొలిసారిగా AI ఫెస్టివల్ పోర్ట్రైట్ ఫీచర్ తీసుకవచ్చారు. ఇది కొన్ని ప్రత్యేక సందర్భాల ఫోటోలను అందంగా తీసే విధంగా రూపొందించబడింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, అధిక ఎనర్జీ డెన్సిటీ (843 Wh/L)తో ఉన్నప్పటికీ, ఫోన్ కేవలం 7.49mm మందం మాత్రమే కలిగి ఉంది. ఈ vivo V60eకు IP68/IP69 రేటింగ్ ఉంది. అంటే ఇది నీరు, దుమ్ము నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ ఫోన్‌లో 5G (SA/NSA), Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, BeiDou, GLONASS, Galileo, QZSS, USB టైపు-C 2.0, NFC వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, USB టైపు-C ఆడియో సపోర్ట్ ఉన్నాయి.
Shilpa Shetty : పోలీసుల ముందు విచారణకు హాజరైన స్టార్ హీరోయిన్
vivo V60e నోబెల్ గోల్డ్, ఎలైట్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు చూస్తే.. 8GB + 128GB వేరియంట్ రూ.29,999, 8GB + 256GB రూ.31,999, 12GB + 256GB రూ.33,999 గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. అధికారికంగా విక్రయాలు అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ ఆఫర్లు కింద, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై (HDFC, ICICI, Axis Bank, SBI) 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI, ఇంకా 1 సంవత్సరం ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీ లభిస్తాయి. అలాగే, vivo TWS 3e ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.1,499కి బండిల్ ఆఫర్‌లో పొందవచ్చు.