Site icon NTV Telugu

Vivo G3 5G: ఐదేళ్ల బ్యాటరీ వారంటీ, డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్‌తో వివో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్లు, ధర ఇలా!

Vivo G3 5g

Vivo G3 5g

Vivo G3 5G: వివో కంపెనీ తమ ‘G’ సిరీస్‌లో కొత్త మోడల్ Vivo G3 5Gను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. జనవరి 2024లో లాంచ్ అయిన Vivo G2 5Gకి ఇది అప్డేటెడ్ గా వచ్చింది. తాజా మోడల్‌ లో భారీ బ్యాటరీ, కొత్త ప్రాసెసర్‌తో పాటు ప్రాక్టికల్ స్పెసిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, గ్లోబల్ లాంచ్‌పై ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

ఈ కొత్త వివో G3 5G 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర చైనాలో 1,499 CNY అంటే రూ.18,300 నుండి ప్రారంభమవుతుంది. ఇక టాప్ వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర CNY 1,999 అంటే సుమారు రూ.24,౩౦౦గా ఉంది. ఈ ఫోన్ కేవలం డైమండ్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది.

APPAR ID: CBSE కీలక నిర్ణయం.. ఇకపై విద్యార్థులకు ఆ ఐడి లేనట్లయితే బోర్డు పరీక్షలు రాయలేరు!

ఈ వివో G3 5G SGS ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తోంది. అంటే ఇది బలమైన బిల్డ్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉండగా కంపెనీ 5 ఏళ్ల బ్యాటరీ హెల్త్ వారంటీ ఇస్తోంది. ఇక దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే ఇందులో 6.74 అంగుళాల LCD స్క్రీన్ (720×1600 పిక్సెల్ రిజల్యూషన్) ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 1500:1 కాంట్రాస్ట్ రేషియో సపోర్ట్ చేస్తుంది.

ఇక మొబైల్ పనితీరు కోసం ఫోన్ MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్, Mali-G57 GPUతో వస్తుంది. ఇది 6GB/8GB LPDDR4X RAM ఆప్షన్లలో లభిస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 256GB UFS 2.2 వేరియంట్, 1128GB eMMC 5.1 వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. ఇక మొబైల్ కెమెరా విభాగంలో కేవలం 13MP రియర్ కెమెరా LED ఫ్లాష్‌తో పాటు, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది ఈ మొబైల్ డ్రాబ్యాక్ గా చెప్పవచ్చు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OriginOS 15 పని చేస్తుంది.

Infinix HOT 60i 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఫోన్ కేవలం రూ.9,299.. కొత్త ఇన్‌ఫినిక్స్ HOT 60i 5G లాంచ్!

ఈ ఫోన్‌లో 5G, డ్యూయల్-బ్యాండ్ WiFi, Bluetooth 5.4, GPS, 3.5mm ఆడియో జాక్, IR బ్లాస్టర్, USB 2.0 పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ కొత్త Vivo G3 5G మొబైల్ డైమెన్షన్స్ 167.3 x 76.95 x 8.19mm కాగా, బరువు 204 గ్రాములు మాత్రమే.

Exit mobile version