మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం విదితమే. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం కారణంగా భారత్‌లోనూ పలు రంగాలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఆయన కీలక సూచనలిచ్చారు. ” ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ అంతరాయాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ అంతరాయానికి కారణం ఏంటో ఇప్పుడే కనుగొన్నారు. సమస్య పరిష్కారానికి కూడా ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్‌పై (NIC) ఎలాంటి ప్రభావం చూపలేదు. ” అని మంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అలాగే సమస్య పరిష్కారానికి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) మైక్రోసాఫ్ట్‌కు పలు కీలక సూచనలు చేసిందని తెలిపారు.
READ MORE: Sridhar Babu: రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి..
కాగా.. మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య వల్ల భారత్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావితమయ్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సాంకేతిక సమస్యల తర్వాత భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌ను సంప్రదించింది. అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి.
READ MORE: Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..
స్పైస్‌జెట్, ఇండిగో మరియు అకాసా ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలను ఉదహరించాయి. ఇండిగో, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు సర్వర్ సమస్యల కారణంగా సర్వీసులు నిలిచిపోయాయని చెబుతున్నాయి. విమానాశ్రయంలో చెక్-ఇన్, చెక్-అవుట్ వ్యవస్థలు స్తంభించాయి. బుకింగ్ సేవ కూడా ప్రభావితమైంది. విమానయాన సంస్థలు మాత్రమే కాకుండా బ్యాంకింగ్ సేవలు, టిక్కెట్ బుకింగ్ మరియు స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా చాలా దేశాల్లో ప్రభావితమయ్యాయి.