Twitter Blue tick : వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్..! ట్విట్టర్ బ్లూ టిక్‌పై యూటర్న్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్తా అధినేత ఎలాన్ మస్క్.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. సీఈవో సహా ఉన్నతాధికారులకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇంటికి పంపిన ఆయన.. ఇక, డబ్బులు వసూలు కార్యక్రమానికి తెరలేపారు.. ట్వి టర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా మార్చేశారు.. ఈ బ్లూ టిక్స్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించిన మస్క్ ఇప్పటికే దానిని అమల్లో పెట్టారు.. అయితే, ఇదే ఈ సోషల్ మీడియా దిగ్గజానికి తలనొప్పిగా మారిపోయిందట.. దీనివల్ల నకిలీ ఖాతాలు ఇబ్బ డిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేయడమే ఉత్తమమా? అనే సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తోంది.. అయితే, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కనిపించడం లేదని కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.. అయితే, ట్విటర్ మస్క్ చేతిలోకి వెళ్లకముందే.. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టులు.. ఇలా ఎవరి ఖాతాలనైనా వెరిఫై చేసి ఈ ‘బ్లూ టిక్’ కేటాయించేవారు. దీంతో ఆ ఖాతా ఆ సంస్థది.. ఆ వ్యక్తిది అని నమ్మేందుకు కచ్చితమైన ఆధారం ఉన్నట్టుగా ఉండేది.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
Read Also: Indigo Flight : హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి గోవాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..
Also Read
- GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
- ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
- Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్‌లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
- 12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఈ ‘బ్లూ టిక్’ సర్వీసులో మార్పులు చేశారు. నెలవారీ ఛార్జీలతో ప్రీమియం వెర్షన్ తీసుకొచ్చారు.. అంటే.. బ్లూటిక్ కావాలంటే.. డబ్బులు చెల్లించాలని.. అంతేకాదు.. నెలకు 8 డాలర్లు చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ‘బ్లూ టిక్’ ఇవ్వడం ప్రారంభించారు.. ఇప్పటికే భారత్‌లోనూ ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఇదే సమయంలో.. నకిలీ బెడద మరింత పెరిగిపోయినట్టు విమర్శలు వస్తున్నాయి.. ప్రముఖ బ్రాండ్లు, సంస్థలు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాలను తెరిచి.. డబ్బులు చెల్లించి.. బ్లూటిక్ పొందుతున్నారు. అంతేకాదు.. వారికి ఇష్టంవచ్చినవి ఆ ఖాతాల్లో ట్వీట్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.. వాటికి కూడా బ్లూటిక్ ఉండటంతో.. ఇదే అసలైనా ఖాతానా? లేకా నకిలీదా? అనేది గుర్తించడం కూడా గందరగోళంగా మారిపోయింది.. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుండడంతో.. ఈ సర్వీసును ట్విట్టర్ నిలిపివేసినట్లు సమాచారం.. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఈ ఆప్షన్ కనిపించకపోవడంతో.. ‘బ్లూ టిక్’పై ట్విట్టర్ యూ టర్న్ తీసుకుందనే ప్రచారం సాగుతోంది. మరి.. మన మస్క్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది.. ట్విట్టర్లో నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని.. కొనుగోలు సమయంలోనే ఆరోపించి వెనక్కి తగ్గిన మస్క్.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో దిగివచ్చి.. ట్విట్టర్ కొనుగోలు చేశారు.. కానీ, ఇప్పుడు మస్క్ తీసుకున్న నిర్ణయంతో ట్విట్టర్లో మరింత గందరగోళమైన పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!