మనకు తెలియని కొత్త నెంబర్స్ ను గుర్తించడానికి వాడే యాప్ ట్రూకాలర్.. ఎక్కడ నుంచి ఎప్పుడూ చేశారు.. వారి ఫోటో మరియు వివరాలను తెలుపుతుంది. స్పామ్ కాల్స్ ను నోటిఫై చేసి వాటిని బ్లాక్ చేయడం దీనిలో స్పెషాలిటీ.. కాగా పెరుగుతున్న టెక్నాలజీ, అలాగే సైబర్ క్రైమ్ లను తగ్గించడానికి కూడా ఇందులో సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు..
గూగుల్ ప్లే, ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్ ప్రకటించింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చింగ్, యాంటీ ఫ్రాడ్ ఫీచర్ యూజర్లకు లభిస్తోందని పేర్కొంది. తద్వారా ఏదైనా నంబర్ కోసం వెతుకుతున్నప్పుడు.. ప్రస్తుతం మార్చిన పేరును తెలియజేస్తుందని అధికారులు తెలిపారు.. ఈ యాప్ ఆయా నంబర్లను మూడు రంగులుగా వర్గీకరిస్తుంది. సాధారణ పేరు మార్పుకు నీలం, అనుమానాస్పదంగా కనిపిస్తే పసుపు, మోసపూరిత మరియు స్కామర్ కార్యకలాపాలను గుర్తిస్తే ఎరుపు రంగు సూచిస్తూ అలర్ట్ చేస్తుంది. అండ్రాయిడ్ సహా iOS ఆపరేటింగ్ సిస్టమ్స్ కు కూడా ఈ ఫీచర్ ను అందిస్తుంది.
ఇకపోతే యాప్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ ను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకోసం సెర్చ్ అనుభవంతో పాటు గోప్యతను మెరుగుపరచేందుకు, మోసాలను నిరోధించేందుకు పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం’ అని CEO అలాన్ మామెడి తెలిపారు.. చాలా మంది యాప్ ను ఉపయోగిస్తున్నారు.. వీరందరి రక్షణ కోసమే సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు.. వీటితో పాటు మరెన్నో ఫీచర్స్ ను అందిస్తుంది..