Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో అనుసరిస్తున్న కొన్ని టారిఫ్ పద్ధతులు పారదర్శకంగా లేవని, అవి వినియోగదారుల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI)పరిగణించింది. ముఖ్యంగా రోజుకు 1GB డేటా అందించే కొన్ని ప్రారంభ స్థాయి ప్లాన్లను జియో నిలిపివేయడంపై విచారణ జరిపిన ట్రాయ్, కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.
రూ.249, రూ.199 ధర కలిగిన ప్లాన్లు కేవలం జియో రిటైల్ స్టోర్లలో మాత్రమే లభిస్తుండగా.. రూ.209 ప్లాన్ కేవలం మై-జియో యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉండటాన్ని ట్రాయ్ తప్పుబట్టింది. ఒకే రకమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వేర్వేరు చోట్లకు వెళ్లాల్సి రావడం టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
Also Read
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
అంతేకాకుండా.. జియో ఫోన్, జియో భారత్ వంటి నిర్దిష్ట పరికరాలను వాడే వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక ఆఫర్లను పరిమితం చేయడం వివక్షా పూరితమని ట్రాయ్ పేర్కొంది. ఇలా ఒక నిర్దిష్టమైన ఫోన్ లేదా సాంకేతికతను కొనుగోలు చేస్తేనే తక్కువ ధర ప్లాన్లు లభిస్తాయనే నిబంధన వినియోగదారుల స్వేచ్ఛను హరిస్తుందని.. దీనివల్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) సదుపాయం కూడా దెబ్బతింటుందని హెచ్చరించింది.
Also Read:Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
ఈ పద్ధతులను సరిదిద్దుకోవడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా రూ.249, రూ.199, రూ.209 వంటి అన్ని ప్లాన్లను వెబ్‌సైట్, మొబైల్ యాప్ మరియు రిటైల్ స్టోర్లలో అందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అలాగే.. జియో భారత్ మరియు జియో ఫోన్ల కోసం అందిస్తున్న ప్రత్యేక ప్లాన్లను ఇతర మొబైల్ ఫోన్లు వాడే వినియోగదారులందరికీ కూడా వర్తింపజేయాలని ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటి సారి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయన్న జియో వాదనను కూడా నియంత్రణ సంస్థ తోసిపుచ్చింది. వినియోగదారులకు ప్లాన్ల ఎంపికలో పూర్తి పారదర్శకత , సమానత్వం ఉండాలని ట్రాయ్ ఈ సందర్భంగా చెప్పింది.
తాజావార్తలు
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!