Site icon NTV Telugu

TikTok: ఇండియాలోకి మళ్లీ టిక్ టాక్.. ఈ వార్త నిజమేనా?

Tik Tok

Tik Tok

TikTok: 2020లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో కనుమరుగైన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మళ్లీ ఇండియాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌తో ముంబైకి చెందిన Sky esports కంపెనీ చర్చలు జరిపింది. టిక్‌టాక్ త్వరలోనే ఇండియాకు వస్తుందని ఆ కంపెనీ సీఈవో శివనంది నిర్ధారించారు. అలాగే BGMI గేమ్ కూడా 100 శాతం తిరిగి ప్రారంభమవుతుందని శివనంది తెలిపారు. కాగా గత నెలలో Hirandandani కంపెనీతోనూ బైట్‌డ్యాన్స్‌ చర్చలు జరిపింది.

Read Also: Bharat Bill Payment System: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ‘భారత్‌’లోనూ బిల్లులు కట్టొచ్చు

అయితే టిక్ టాక్‌ను మళ్లీ పునరుద్ధరించే అంశంపై ఐదు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నడుస్తున్నాయని Sky esports సీఈవో శివనంది తెలిపారు. వాస్తవానికి ప్లే స్టోర్ నుండి టిక్‌టాక్‌ను తీసివేయడానికి వారం ముంద, ప్రభుత్వం క్రాఫ్టన్ హెచ్‌క్యూకి మధ్యంతర నోటీసులు పంపిందని… అందుకే చాలా అడ్వాన్స్ మొత్తాన్ని Sky esports లీగ్, LAN ఢిల్లీకి చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. BGMI గేమ్ కూడా త్వరలోనే ఇండియాకు తిరిగి రావడంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని.. తమ యాప్‌పై పడిందని పూర్తి నిషేధం కాదని.. మధ్యంతర ఉత్తర్వుల కారణంగానే నిషేధం విధించారని శివనంది గుర్తుచేశారు. మొత్తానికి టిక్ టాక్ త్వరలో మళ్లీ ఇండియాలోకి అడుగుపెట్టనుందన్న వార్త తెలుసుకుని పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా చైనాతో ఘర్షణల కారణంగా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర యాప్‌లను కేంద్రం నిషేధించింది.

Exit mobile version