నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!
- టెక్నో స్పార్క్ 50 5జీ ఫోన్ మార్చి 27న భారతదేశంలో లాంచ్
- ఫాంటసీ పర్పుల్, మింట్ గ్రీన్, ఇంక్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి
- ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) సర్టిఫికేషన్
- భారీ 6500mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- “పవర్ కా తషన్” ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TECNO Spark 50 5G Launch: టెక్నో (TECNO) సంస్థ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ లో భాగంగా టెక్నో స్పార్క్ 50 5జీ ఫోన్ (TECNO Spark 50 5G) ను భారతదేశంలో మార్చి 27న లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ కొత్త డిజైన్‌తో రానుంది. ఫోన్ వెనుక భాగంలో పిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఈ ఫోన్ ఫాంటసీ పర్పుల్, మింట్ గ్రీన్, ఇంక్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ వంటి నాలుగు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయంలో అసలు రాజిపడలేదు. ఇది మిలిటరీ గ్రేడ్ టెస్టింగ్ (ఎంఐఎల్-ఎస్టీడీ 810హెచ్ సర్టిఫికేషన్) పొందినట్లు కంపెనీ ప్రకటించింది.
Also Read
- Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్‌ప్లే!
- Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
- Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
- iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
“పవర్ కా తషన్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్ భారీ 6500 mah బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్పార్క్ 50 5జీ ఫోన్‌లో పలు ప్రత్యేక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో వేగవంతమైన డేటా డౌన్‌లోడ్ మరియు స్థిరమైన నెట్‌వర్క్ కోసం 4×4 మిమో సపోర్ట్, ఇంకా “యూపీఎస్ 3.0 సిగ్నల్ బూస్టింగ్ టెక్నాలజీ” ద్వారా NFC ద్వారా యూపీఐ చెల్లింపులు మరింత వేగంగా, విశ్వసనీయంగా చేయగలుగుతారు. అలాగే సెల్యులార్ టవర్స్ లేదా వై-ఫై లేకుండానే నెట్‌వర్క్ లేకుండా కమ్యూనికేషన్ చేసే టెక్నాలజీని పొందుపరిచారు.

Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!
ఈ ఫోన్‌లో Techno Ella ఏఐ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. ఇది బహుభాషా అనువాదం, వాయిస్ కమాండ్స్ కు మద్దతు ఇస్తూ భారతీయ ప్రాంతీయ భాషలకు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ టెక్నో స్పార్క్ 50 5జీ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు ఈ మార్చి 27న తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Tesla Roadster: టెస్లా ఫ్లయింగ్ కార్.. భారత్‌లో బుకింగ్స్ ప్రారంభం.. రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్!
-
Horoscope : నవంబర్‌లో అరుదైన ‘మహాలక్ష్మీ రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
-
Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
-
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
-
Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!