144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!
- Camon 50 Ultra 5G మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల
- 6.78 అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్.
- 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీ
- 7.4mm సన్నని బాడీ, 178 గ్రాముల తక్కువ బరువు.
- IP68, IP69, IP69K రేటింగ్‌లతో ధూళి, నీటి నిరోధకత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tecno Camon 50 Ultra 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో (Tecno) ‘కామోన్’ (Camon) సిరీస్ లో అత్యంత శక్తివంతమైన మోడల్ Tecno Camon 50 Ultra 5Gను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మొబైల్ ఫోటోగ్రఫీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్.. అధునాతన కెమెరా సెన్సార్లు, AI ఆధారిత ఫీచర్లు, అత్యంత ధృడమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షించేలా దీనిని తాయారు చేశారు.
కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED స్క్రీన్, 1.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం అత్యంత స్మూత్ గా ఉంటుంది. కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు ‘ProXDR’ ఐ-కేర్ టెక్నాలజీని అమర్చారు. స్క్రీన్ రక్షణ కోసం “గొరిల్లా గ్లాస్ విక్టస్ 2” గ్లాస్‌ను ఉపయోగించారు.
Also Read
- BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
- Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
TTD Laddu Controversy: నేటి నుంచి కల్తీ లడ్డుపై ఏకసభ్య కమిషన్ విచారణ స్టార్ట్
ట్రిపుల్ కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అందించారు. 50MP Sony LYT-700C ప్రైమరీ సెన్సార్ OIS సపోర్ట్‌తో వస్తుంది. ఇంకా 50MP టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌తో పోర్ట్రెయిట్ ఫోటోల కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మంచి దృశ్యాలను క్యాప్చర్ చేయగలదు. ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. AI 60x సూపర్ జూమ్, గ్లేర్ రిమూవర్, షాడో రిమూవర్ వంటి స్మార్ట్ ఎడిటింగ్ ఫీచర్లు ఫోటో క్వాలిటీని మరింత మెరుగుపరుస్తాయి.
ప్రాసెసర్:
మీడియాటెక్ డిమెంసిటీ 7400 అల్టిమెట్ (4nm) చిప్‌సెట్ ఈ ఫోన్ లో ఉపయోగిచారు. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ వంటి టాస్క్‌లను ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై ఈ ఫోన్ నడుస్తుంది. కంపెనీ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇచ్చింది.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్:
ఈ ఫోన్ లో 6500mAh భారీ బ్యాటరీ మరో ప్రధాన ఆకర్షణ. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కువ సేపు వినియోగానికి ఇది అనుకూలంగా ఉంటుంది.
మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?
ధృడమైన డిజైన్:
ఈ మొబైల్ కేవలం 7.4mm సన్నని బాడీ, 178 గ్రాముల తక్కువ బరువుతో ఉన్నప్పటికీ ఈ ఫోన్ అత్యంత రగ్గడ్ డిజైన్ తో తయారు చేయబడుతుంది. IP68, IP69, IP69K రేటింగ్‌లతో ధూళి, నీరు, అధిక పీడన వాటర్ జెట్ లను తట్టుకోగలదు. నీటిలో 2 మీటర్ల లోతు వరకు సురక్షితంగా పని చేయగలదు. ‘అండర్ వాటర్ మోడ్’ ద్వారా నీటి అడుగున ఫోటోలు తీసే ప్రత్యేక ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన ఈ మోడల్, త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
తాజావార్తలు
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!