144Hz AMOLED, 6150mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో Tecno Camon 50 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tecno Camon 50 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) తన కామన్ సిరీస్‌లో భాగంగా సరికొత్త మోడళ్లను ప్రపంచ మార్కెట్ లో లాంచ్ చేసింది. టెక్నో కామన్ 50 (Tecno Camon 50), టెక్నో కామన్ 50 ప్రో (Tecno Camon 50 Pro) స్మార్ట్‌ఫోన్లు మంచి కెమెరా ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకొనేలా ఉంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2026కు ముందే ఈ ఫోన్ల వివరాలను కంపెనీ వెల్లడించింది. మరి ఈ మొబైల్స్ పూర్తి వివరాలు చూసేద్దామా..
డిస్‌ప్లే & డిజైన్:
టెక్నో కామన్ 50 ప్రో, కామన్ 50 రెండు ఫోన్లు 6.78 అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేతో వస్తాయి. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ప్రో మోడల్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ డిస్‌ప్లే హై-క్వాలిటీ విజువల్స్, స్మూత్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
Also Read
- Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
- Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. కంటెంట్ క్రియేటర్లకు మరింత ప్రయోజనం
- iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
- Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్‌తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!
పెర్ఫార్మెన్స్:
ఈ స్మార్ట్‌ఫోన్లలో మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ (MediaTek Helio G200 Ultimate) చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ప్రో మోడల్‌లో 12GB వరకు ర్యామ్ (RAM), 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయి.

కెమెరా ఫీచర్లు:
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం టెక్నో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కామన్ 50 ప్రో మొబైల్ లో వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP టెలిఫోటో లెన్స్ (3X జూమ్) మరియు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇక కామన్ 50లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీ విషయంలో రెండు ఫోన్లలో కూడా ముందు భాగంలో 32MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరాను అందించారు.
బ్యాటరీ & ఛార్జింగ్:
ఈ సిరీస్‌లో అతిపెద్ద ఆకర్షణ 6,150mAh భారీ బ్యాటరీ. ఇది సాధారణ వినియోగంలో ఎక్కువ కాలం పాటు పనిచేస్తుంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐదేళ్ల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ధరలు:
ప్రస్తుతానికి ఈ ఫోన్లు కెన్యా వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. టెక్నో కామన్ 50 ధర రూ. 24,000 కాగా.. టెక్నో కామన్ 50 ప్రో సుమారు రూ. 27,000 వరకు నిర్ణయించింది కంపెనీ. ఈ ఫోన్లు మూన్‌లైట్ బ్లాక్, మలాకైట్ గ్రీన్, లావెండర్ మిస్ట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 23 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారతదేశంలో వీటి విడుదల తేదీ, ధరపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!