Site icon NTV Telugu

హోమ్ థియేటర్ అనుభవం, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో Sony BRAVIA 2M2 Series 4K Ultra HD 75 అంగుళాల స్మార్ట్ LED గూగుల్ టీవీపై రూ. 1,31,000+ భారీ డిస్కౌంట్!

Sony

Sony

Sony BRAVIA 2M2 Series 4K Ultra HD TV: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ (Sony) నుండి బ్రావియా (BRAVIA) సిరీస్‌లో భాగంగా 75-అంగుళాల భారీ స్క్రీన్‌ తో కొత్త 4K స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుక వచ్చింది. ఈ Sony BRAVIA 2M2 Series 75-inch (K-75S25BM2) మోడల్ ఆధునిక ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన వినోద అనుభవాన్ని అందించేలా రూపొందించబడింది. ఈ స్మార్ట్ టీవీ 189 సెం.మీ (75 అంగుళాలు) LED డిస్‌ప్లేతో పాటు 4K అల్ట్రా HD (3840×2160 పిక్సెల్స్) రిజల్యూషన్ అందిస్తుంది. 178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటం వల్ల ఏ కోణంలో చూసినా స్పష్టమైన చిత్ర నాణ్యత కనిపిస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో వీడియోలు, టీవీ కంటెంట్ బాగా కనపడతాయి.

స్లిమ్ బెజెల్స్‌, టూ-వే స్పీకర్లతో రాబోతున్న Xiaomi X Pro QLED (2026) 75 అంగుళాల టీవీ.. ఫీచర్స్ ఇవే!

ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్యాస్ట్, వాచ్ లిస్ట్, గేమ్ మెనూ, ALLM, eARC (HDMI 2.1 కంపాటిబిలిటీ) వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఆపిల్ ఎయిర్ ప్లే 2, ఆపిల్ హోమ్ కిట్, అలెక్స సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. గేమింగ్ కన్సోల్, ల్యాప్‌ టాప్, స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాలను సులభంగా కనెక్ట్ చేసుకునే విధంగా HDMI, USB, ఈథర్నెట్, Wi-Fi కనెక్టివిటీ ఎంపికలు ఇవ్వబడ్డాయి. ఆడియో పరంగా ఈ టీవీలో డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20W స్పీకర్ అవుట్‌పుట్ అందించబడింది.

Ind vs Nam : నమీబియాపై భారత్ ఘనవిజయం.. ఇషాన్, హార్దిక్ మెరుపులు.!

డిజైన్ విషయానికి వస్తే.. ఈ టీవీ స్లిమ్ బాడీతో పాటు టేబుల్-టాప్ స్టాండ్, వాల్-మౌంట్ సపోర్ట్ కలిగి ఉంది. టీవీ బరువు సుమారు 28 కిలోలు. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో సంవత్సరానికి సుమారు 295.37 kWh విద్యుత్ వినియోగం ఉంటుంది.భారత్‌లో ఈ టీవీ ధర అసలు ధర రూ. 2,39,900గా ఉండగా, ప్రస్తుతం ఆఫర్‌లో సుమారు రూ. 1,07,990గా ఉంది. పరిమిత కాల ఆఫర్లలో భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. EMI ఆప్షన్లు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version