Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Smartphone Hacking Signs And Safety Tips

Hacking: ఇది హ్యాకింగ్ మొదటిదెబ్బ..! జాగ్రత్త.. మీ ఫోన్ డేంజర్‌లో ఉండొచ్చు..!

Published Date :July 7, 2025 , 2:25 pm
By Gogikar Sai Krishna
  • నకిలీ లింక్‌లతో మోసాలు.. అప్రమత్తంగా ఉండండి
  • ఫోన్ హ్యాక్ అయినట్టు కనిపించే లక్షణాలు ఇవే..!
  • డిజిటల్ లోకంలో సురక్షితంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు
Hacking: ఇది హ్యాకింగ్ మొదటిదెబ్బ..! జాగ్రత్త.. మీ ఫోన్ డేంజర్‌లో ఉండొచ్చు..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Hacking: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవనశైలిలో విడదీయరాని భాగంగా మారింది. బ్యాంకింగ్, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, ఫొటోలు, పర్సనల్ డేటా.. అన్నింటికీ ఈ చిన్న డివైస్ ఆధారంగా మారింది. అయితే, టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ క్రైమ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. హ్యాకర్లు సరికొత్త మార్గాలను ఉపయోగించి ఫోన్‌లోని డేటాను చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

సాధారణంగా ఒక నకిలీ లింక్‌పై క్లిక్ చేయడం, అపరిచితమైన యాప్‌కు అనుమతి ఇవ్వడం వంటి చిన్న అజాగ్రత్తలతోనే ఫోన్ పూర్తిగా హ్యాక్ అవుతుంది. అయితే, కొన్ని లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, మీరు డేటా, డివైస్, డబ్బును కూడా రక్షించుకోవచ్చు.

Also Read

  • Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్
  • Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్
  • Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్‌ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్‌నెస్ ట్రాకర్ ..
  • LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..
Add as a preferred
source on google

స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యే లక్షణాలు
1. ఫోన్ ఆన్-ఆఫ్ అవుతూ ఉండటం : మీ ఫోన్ ఎటువంటి కారణం లేకుండా పదే పదే స్వయంగా ఆన్ అవుతూ, ఆఫ్ అవుతూ ఉంటే.. అది రిమోట్ యాక్సెస్ ద్వారా ఎవరో ఫోన్‌ను నియంత్రిస్తున్న సూచన కావచ్చు.
2. బ్యాటరీ వేగంగా ఖాళీ అవటం : మీరు సాధారణంగా ఫోన్ వాడుతున్నా బ్యాటరీ చాలా త్వరగా ఖాళీ అవుతోందా? అప్పుడు మాల్వేర్ లేదా స్పైవేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మీ సమాచారం చోరీ చేస్తున్న అవకాశం ఉంది.
3. అపరిచిత నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు : చాలా సందర్భాల్లో హ్యాకింగ్ కారణంగా అనుమానాస్పద నంబర్ల నుంచి మీకు సందేశాలు లేదా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అలాగే, మీ ఫోన్ నుంచి మీకు తెలియకుండానే ఇతరులకు సందేశాలు వెళ్లడం కూడా హ్యాకింగ్ లక్షణమే.
4. ఫోన్ ఫ్రీజ్ అవ్వడం, ఆలస్యం కావడం : ఫోన్ పని చేయడంలో ఆటంకం ఏర్పడడం, స్వయంగా యాప్స్ ఓపెన్ అవ్వడం వంటి లక్షణాలు ఫోన్‌లో ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్ నిండి ఉందని సూచిస్తాయి.
5. డేటా వినియోగం అకారణంగా పెరగడం : మీ డేటా వినియోగం తేడా లేకుండా అకస్మాత్తుగా పెరిగిపోతే, మీ ఫోన్ నుంచి ఎవరో డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తున్న అవకాశాన్ని సూచిస్తుంది.

ఈ లక్షణాలు మీ ఫోన్‌లో కనిపిస్తే భయపడకండి. వెంటనే ఈ జాగ్రత్త చర్యలు తీసుకోండి:

  • అపరిచిత లింక్‌లు క్లిక్ చేయవద్దు
  • అనవసరమైన యాప్‌లను తొలగించండి
  • ఫోన్‌కు సురక్షిత పాస్‌కోడ్ పెట్టండి
  • ఫోన్‌ను రీసెట్ చేయడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్, పర్సనల్ డేటా యాక్సెస్‌ను తాత్కాలికంగా ఆపేయండి

సాంకేతిక ప్రగతి మన జీవితాలను సులభతరం చేస్తోంది కానీ, అదే సమయంలో అప్రమత్తత లేకపోతే పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cyber awareness
  • cyber crime
  • data theft
  • Digital Safety Tips
  • Hacking Signs

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!

  • Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్‌ రింగు రోడ్డు పనులు..!

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?

  • Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..

  • Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions