అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy Z Fold8 Ultra: శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా (Galaxy Z Fold8 Ultra)ను లాంచ్ చేసింది. ఏడేళ్లుగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్ లో ఉన్నా, తొలిసారిగా అల్ట్రా (Ultra) బ్రాండింగ్‌ను ఫోల్డబుల్ విభాగంలోకి తీసుకొచ్చింది.
అల్ట్రా స్లిమ్ డిజైన్:
Galaxy Z Fold8 Ultraను విప్పితే కేవలం 4.1mm మందం మాత్రమే ఉండి.. బరువు 215 గ్రా. ఉంది. ఇందులో 8 అంగుళాల QXGA+ Dynamic AMOLED 2X మెయిన్ డిస్ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. బయట భాగంలో 6.5 అంగుళాల FHD+ AMOLED కవర్ డిస్ప్లేను అందించారు.
Also Read
- Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
- Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
అత్యుత్తమ పనితీరు:
ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు Qualcomm Snapdragon 8 Elite Gen 5 (3nm) చిప్సెట్ శక్తినిస్తుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 840 GPU ఉంది. ఫోన్ 12GB/16GB RAM, 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9పై పనిచేస్తుంది.
8K వీడియో రికార్డింగ్:
ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 200MP మెయిన్ కెమెరా (OIS), 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్, 30x స్పేస్ జూమ్), సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.. లోపల, బయట 10MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్లో నైటోగ్రఫీ, 8K వీడియో రికార్డింగ్, Cine LUT కలర్ గ్రేడింగ్ వంటి అధునాతన వీడియో ఫీచర్లు కూడా ఉన్నాయి.
AI ఫీచర్స్:
One UI 9తో వచ్చిన Galaxy Z Fold8 Ultraలో శాంసంగ్ పలు AI ఫీచర్లను అందించింది. Now Nudge ఫీచర్ స్క్రీన్‌పై జరుగుతున్న సంభాషణలను విశ్లేషించి, క్యాలెండర్ ఈవెంట్లు, లొకేషన్లు లాంటి చర్యలను సూచిస్తుంది. ఇంకా Gemini Notebook ద్వారా నోట్స్, ఫైల్స్, ఆడియో రికార్డింగ్స్, ఫోటోలను ఒకే వర్క్‌స్పేస్‌లో నిర్వహించవచ్చు. AI సహాయంతో మీటింగ్ సమ్మరీలు, ఆడియో ఓవర్వ్యూలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌ను కూడా రూపొందించవచ్చు.
5,000mAh బ్యాటరీ:
Galaxy Z Fold8 Ultraలో 5,000mAh బ్యాటరీను అందించారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్లెస్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ స్లిమ్ డిజైన్‌ను అందించారు. గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ను ఉండడం ద్వారా హీట్ మేనేజ్మెంట్ను కూడా మెరుగుపరిచారు.

ధరలు:
భారత్‌లో Galaxy Z Fold8 Ultra మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కు ప్రస్తుతం భారత్‌తో పాటు ఎంపిక చేసిన మార్కెట్లలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అమ్మకాలు ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్నాయి.
* 12GB + 256GB – రూ.1,99,999
* 12GB + 512GB – రూ.2,19,999
* 16GB + 1TB – రూ.2,59,999
ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులకు రూ.10,000 అప్‌గ్రేడ్ బోనస్ లేదా రూ.9,000 బ్యాంక్/UPI క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. అలాగే 30 నెలల వరకు నో-కాస్ట్ EMI (జీరో డౌన్ పేమెంట్) లేదా 9 నెలల జీరో డౌన్ పేమెంట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!