Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంవత్సరం ప్రారంభంలో గెలాక్సీ S26 సిరీస్‌ను విడుదల చేసిన శాంసంగ్, ఇప్పుడు లండన్‌లో జూలై 22న జరగనున్న రెండవ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ కు సిద్ధమైంది. ఈ వేడుకలో కొత్త ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్‌వాచ్‌లు విడుదల కానున్నాయి.
ఎక్కడ చూడవచ్చు..?
లండన్‌లో జూలై 22 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు) ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌ను శాంసంగ్ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. ఈ ఈవెంట్లో ప్రధానంగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 సిరీస్ (మొదటి వైడ్-ఫోల్డింగ్ ఫోన్), Z ఫోల్డ్ 8 అల్ట్రా, Z ఫ్లిప్ 8 ఫోన్లు; అలాగే గెలాక్సీ వాచ్ 9, వాచ్ అల్ట్రా 2, కంపెనీ మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read
- 7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
- Vivo T5e: వివో T5e స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 48% తగ్గింపుతో రూ.13,999కే.. 5500mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లే
- Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
- Airtel నుంచి 'Buy 1 Get 1' ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
ఫోల్డబుల్ ఫోన్ల అంచనాలు..
Z ఫోల్డ్ 8 అనేది శాంసంగ్ మొదటి వైడ్-ఫోల్డింగ్ ఫోన్. ఇది బయట 5.5-అంగుళాల, లోపల 7.6-అంగుళాల QHD+ AMOLED డిస్ప్లేలు, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. Z ఫోల్డ్ 7 కు కొనసాగింపుగా రానున్న Z ఫోల్డ్ 8 అల్ట్రా, బయట 6.5 అంగుళాలు, లోపల 8 అంగుళాల డిస్ప్లేలతో, ట్రిపుల్ కెమెరాతో రావచ్చు. ఈ రెండు ఫోన్లు పవర్ఫుల్ ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5’ ప్రాసెసర్ తో పాటు కొత్త ‘ఫ్లెక్స్ టైటానియం’ డిస్ప్లే టెక్నాలజీతో వస్తాయని అంచనా.
గెలాక్సీ Z ఫ్లిప్ 8: ఈ క్లామ్‌షెల్ ఫోన్ బయట 4.1 అంగుళాల స్క్రీన్, లోపల 6.9-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్ కెమెరాలతో కూడిన డ్యూయల్ సెటప్, 4300mAh బ్యాటరీ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో ఇది రావచ్చు.
గెలాక్సీ వాచ్ 9 క్రీమ్, గ్రీన్, గ్రాఫైట్ రంగులలో (40mm, 44mm సైజులు), వాచ్ అల్ట్రా 2 సింగిల్ 47mm సైజులో (గ్రే, సిల్వర్ రంగులు) వస్తాయని లీక్‌ల ద్వారా తెలిసింది. వార్బీ పార్కర్, జెంటిల్ మాన్స్టర్ భాగస్వామ్యంతో తయారైన శాంసంగ్ మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్ కూడా ఈ ఈవెంట్లో ఆవిష్కృతం కానున్నాయి. మొత్తంగా చూస్తే.. సరికొత్త టెక్నాలజీలతో శాంసంగ్ మరోసారి టెక్ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!