Samsung Galaxy S26 Ultra Launch: ‘గెలాక్సీ ఎస్26 అల్ట్రా’ వచ్చేసింది.. ‘ప్రైవసీ డిస్ప్లే’తో కొత్త బెంచ్‌మార్క్!
- గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్ సిరీస్ వచ్చేసింది
- 200MP కెమెరా, 5000mAh బ్యాటరీ
- 'ప్రైవసీ డిస్ప్లే'తో కొత్త బెంచ్‌మార్క్
Samsung Galaxy S26 Ultra Launch and Price: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ‘శాంసంగ్’.. గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈవెంట్లో అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో మూడు మోడల్స్ (అల్ట్రా, ప్లస్, స్టాండర్డ్ వెర్షన్లు) ఉన్నాయి. డిజైన్‌లో పెద్ద మార్పులు చేయకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, రియల్-వరల్డ్ ప్రైవసీ టెక్నాలజీపై కంపెనీ ప్రధాన దృష్టి పెట్టడం విశేషం. ముఖ్యంగా ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Galaxy S26 Ultra Price:
ధరల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మోడల్ ధర సుమారు 1300 డాలర్లు (రూ.1,18,103)గా ఉంది. ప్లస్ మోడల్ 1100 డాలర్లు (రూ.99,932) కాగా.. స్టాండర్డ్ వెర్షన్ 900 డాలర్లు (రూ.81,762)గా కంపెనీ నిర్ణయించింది. ఇండియన్ మార్కెట్లో ఈ ధరలు ఎక్కువగా ఉండనున్నాయి. ప్లస్, బేసిక్ మోడళ్ల ధరలు గత ఏడాదితో పోలిస్తే 100 డాలర్లు (రూ.9,082)పెరిగాయి. మెమరీ చిప్ కొరత కారణంగా ఈ ధర పెంపు జరిగి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ధరలతో శాంసంగ్ ఫోన్లు ఐఫోన్ తాజా సిరీస్‌తో పోటీపడనున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్‌కు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ శాంసంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ S26 అల్ట్రాను విడుదల చేసింది.
Also Read
- OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
- Realme C100x: రియల్మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
- Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
Galaxy S26 Ultra Display:
గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్లో 6.9 అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోలెడ్ 2X డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు M14 లీడ్ ప్యానెల్ టెక్నాలజీతో విజువల్స్ మరింత క్లియర్‌గా కనిపిస్తాయి. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, స్క్రోలింగ్‌లో స్మూత్ అనుభవం అందిస్తుంది. ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ కారణంగా.. స్క్రీన్‌ను పక్కల నుంచి చూసే వారికి కంటెంట్ అస్సలు కనిపించదు. ఈ ఫీచర్‌ను ఎప్పుడూ ఆన్‌గా ఉంచుకోవచ్చు. బ్యాంకింగ్, మెయిల్, పాస్వర్డ్ ఎంట్రీ వంటి యాప్‌లు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యేలా కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఫీచర్‌ను యాక్టివ్ చేస్తే.. ఫోన్ స్క్రీన్‌ను పక్క నుంచి లేదా పైకీ కింద నుంచి చూడటం చాలా కష్టమవుతుంది.
Galaxy S26 Ultra Processor:
గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్లో ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 గెలాక్సీ ప్రాసెసర్ ఇచ్చారు. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, ఏఐ ఫీచర్లను సులభంగా రన్ చేస్తుంది. తాజా OneUI 8.5 సాఫ్ట్‌వేర్‌తో వచ్చిన ఈ ఫోన్‌కు కంపెనీ 7 సంవత్సరాల ఓఎస్ అప్డేట్స్ హామీ ఇచ్చింది.
Galaxy S26 Ultra Camera:
కెమెరా సెగ్మెంట్లో ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. 200MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రా వైడ్, 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో, 10MP 3x టెలిఫోటో లెన్స్‌లతో శక్తివంతమైన క్వాడ్ కెమెరా సెటప్ అందించారు. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక డ్రీమ్ డివైస్‌గా మారే అవకాశముంది.
Galaxy S26 Ultra Battery:
బ్యాటరీ విషయానికి వస్తే.. 5000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో పాటు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 30 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. స్టోర్లలో మార్చి 11 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. మొత్తం మీద చూస్తే పనితీరు, కెమెరా, డిస్ప్లే, సాఫ్ట్వేర్ సపోర్ట్ అన్నీ కలిపి గెలాక్సీ S26 అల్ట్రా ప్రీమియం ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో కొత్త ప్రమాణాలు సృష్టించేలా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!