Site icon NTV Telugu

Samsung Galaxy S26 సిరీస్ మొబైల్స్ కొనాలంటే పర్సులు ఖాళీ అవ్వాల్సిందేనా..!

Samsung S26

Samsung S26

Samsung Galaxy S26 Series: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు ధరల విషయంలో షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. Samsung Galaxy S26 సిరీస్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని, దీనికి ప్రధాన కారణం కాంపోనెంట్ ఖర్చులు పెరగడం అని తెలుస్తోంది. నివేదికల ప్రకారం త్వరలో రాబోయే Galaxy S26, Galaxy S26+, Galaxy S26 Ultra మోడళ్లతో కూడిన ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 2026లో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేయాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. అయితే, లాంచ్ తర్వాత దాదాపు నెలరోజులకు మాత్రమే ఈ ఫోన్లు అమ్మకాలకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

2025 National Rewind: ఈ ఏడాది జాతీయంగా చరిత్ర సృష్టించిన నారీమణులు వీరే!

కొరియన్ మీడియా సంస్థ ‘ది బెల్’ వెల్లడించిన వివరాల ప్రకారం, సామ్‌సంగ్‌లోని Mobile Experience (MX) డివిజన్ తయారీ ఖర్చులను నియంత్రించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా DRAM, మెమరీ చిప్స్ వంటి కీలక భాగాల ధరలు భారీగా పెరగడం, అలాగే మార్కెట్లో తీవ్రమైన పోటీ కారణంగా మార్కెటింగ్, లేబర్ ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో రాబోయే ఫోన్లకు “అసలైన ధరలు” నిర్ణయించడం కష్టంగా మారిందని నివేదిక చెబుతోంది.

Lenin: అఖిల్ ‘లెనిన్’.. అవుట్‌పుట్‌ పై నిర్మాత కాన్ఫిడెంట్ కామెంట్స్

ఈ పరిస్థితుల నేపథ్యంలో Galaxy S26 సిరీస్ ధరలు, Galaxy S25 సిరీస్‌తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరో కొరియన్ నివేదిక కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. అందులో లాభాల మార్జిన్స్‌ను కాపాడుకోవడం కోసమే శాంసంగ్ ధరలు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా మెమరీ భాగాల కొరత కొనసాగుతున్నందున, తయారీ వ్యయం తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version