Samsung Galaxy S25 FE: శాంసంగ్ తన కొత్త గ్యాలక్సీ S25 FE (Samsung Galaxy S25 FE) స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల ప్రారంభంలో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. తాజాగా ఇది అధికారికంగా విక్రయాలకు అందుబాటులోకి వచ్చింది. మిడ్‌రేంజ్ S సిరీస్లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ డిజైన్, ఫీచర్లు, ఆఫర్లతో టెక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. Samsung Galaxy S25 FE మిడ్‌రేంజ్ ప్రైస్ సెగ్మెంట్‌లో ఉన్నప్పటికీ, ప్రీమియం ఫీచర్లను కలిగి ఉండటం ప్రత్యేక ఆకర్షణ. శక్తివంతమైన ప్రాసెసర్, ఉన్నతమైన కెమెరా సెటప్, వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే అవకాశముంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను ఒకసారి చూసేద్దామా..
Gautam Gambhir Salary: అయ్యా బాబోయ్.. గౌతమ్ గంభీర్ శాలరీ అన్ని కోట్లా?
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.7 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గోరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ.
ప్రాసెసర్: Samsung Exynos 2400 4nm చిప్‌సెట్, Xclipse 940 GPU, గరిష్టంగా 3.1GHz స్పీడ్.
ర్యామ్ & స్టోరేజ్: 8GB RAM, 128GB/256GB/512GB స్టోరేజ్ ఆప్షన్లు.
సాఫ్ట్‌వేర్: Android 16, One UI 8
కెమెరా: వెనుక 50MP OIS ప్రైమరీ + 12MP అల్ట్రా వైడ్ + 8MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్, OIS), ముందు 12MP సెల్ఫీ కెమెరా.
బ్యాటరీ: 4,900mAh, 45W ఫాస్ట్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్ షేర్ సపోర్ట్.
ఇతర ఫీచర్లు: IP68 వాటర్ రెసిస్టెంట్, డాల్బీ ఆట్మాస్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, Wi-Fi 6E, Bluetooth 5.4, NFC
IND vs AUS: ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు స్టార్ ప్లేయర్ అవుట్.. రోహిత్, విరాట్..!
శాంసంగ్ గ్యాలక్సీ S25 FE నేవీ, జెట్ బ్లాక్, వైట్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB + 128GB మోడల్ ధర రూ.59,999గా, 8GB + 256GB మోడల్ ధర రూ.65,999గా, 8GB + 512GB మోడల్ ధర రూ.77,999గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ డివైస్ శాంసంగ్ స్టోర్, శాంసంగ్ స్టోర్స్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు ఇంకా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్స్ లో భాగంగా.. సామ్‌సంగ్ పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.12,000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ను అందిస్తోంది (256GB కొంటే 512GB ఉచితంగా లభిస్తుంది). అంతేకాకుండా, Galaxy Buds3 FE పై 4,000 తగ్గింపు, రెండు సంవత్సరాల స్క్రీన్ ప్రొటెక్షన్ కేవలం రూ.4,199 నుండి లభిస్తోంది. అలాగే రూ.5,000 వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.