Elephants Destroys Crop: పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామ పరిసరాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్థరాత్రి సమయంలో గ్రామ పరిసరాల పంట పొలాల్లోకి చొచ్చుకుని వచ్చిన ఏనుగుల గుంపు పంటలకు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. గ్రామానికి చెందిన రైతు శివుని నాయుడు సాగు చేస్తున్న ఆనపకాయ, టమాటా, ఫామ్ ఆయిల్ పంటలను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. పొలాలన్నీ చిందరవందరగా మారడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు.
Read Also: Suzuki: హిస్టరీ క్రియేట్ చేసిన సుజుకి.. 20 ఏళ్లలో 10 మిలియన్ల బైకులు తయారీ.. కస్టమర్లకు బంపరాఫర్స్
ఇక, ఏనుగుల సంచారంతో గ్రామంలోని రైతులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ఏనుగుల బెడద పెరుగుతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగులను అడవుల్లోకి మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఏనుగులు ఇలా చేస్తే.. మమల్ని ఆదుకునే వారే లేరని పేర్కొంటున్నారు.