శాంసంగ్ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను శాంసంగ్ మార్కెట్ లోకి వదిలింది.. గెలాక్సీ A25 5జీ ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ వెబ్ సైట్ లో ఫీచర్స్, మోడల్ నెంబర్ లీక్ అయ్యింది.. 6.44-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుందని, ఎక్సినోస్ 1280 ఎస్ఓసీపై రన్ అవుతుందని భావిస్తున్నారు. 25 డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000ఎంహెచ్ బ్యాటరీతో బ్యాకప్ అయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ ఎ25 5జీ ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారికంగా వచ్చిన గెలాక్సీ ఎ24కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రావచ్చునని నిపుణులు చెబుతున్నారు..
శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6పై రన్ అవుతుంది. 6.44-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఎక్సోనస్ 1280 SoCపై రన్ అవుతుంది. శాంసంగ్ హ్యాండ్‌సెట్‌లో 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది. 25డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంహెచ్ బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. గెలాక్సీ ఎ25 5జీ గెలాక్సీ ఎ24 అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అదే ఫోన్ కు స్టోరేజ్ ను పెంచి మార్కెట్ లోకి తీసుకురానున్నారని తెలుస్తుంది..
ఇక ధర విషయానికొస్తే.. ఎ25 5జీ మోడల్ నంబర్ ఎస్ఎమ్-ఎ256ఈ/డీఎస్ఎన్‌ని కలిగిన శాంసంగ్ హ్యాండ్‌సెట్ కంపెనీ భారత వెబ్‌సైట్‌లో గుర్తించింది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ వంటి వివరాలతో సపోర్ట్ పేజీలో వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ గత గీక్‌బెంచ్ మోడల్ నంబర్‌తో కనిపించింది.. ఈ ఫోన్ ఖరీదు మనం రూపాయలలో రూ. రూ. 26,800 గా ఉంటుంది.. ఇక అలాగే 6జీబీ ర్యామ్+ 128జీబీ 8జీబీ ర్యామ్+ 256జీబీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.. ఇంకా మరెన్నో ఫీచర్స్ ను కలిగి ఉంది.. అందుకే దీనికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుందని అంచనా..