జియో తన పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. యూజర్లకు చౌక ధరలోనే అదిరిపోయే బెనిఫిట్స్ తో ప్లాన్స్ ను అందిస్తోంది. తక్కువ ధరకే డాటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో సినిమాకి ఫ్రీ యాక్సెస్ ను కూడా అందిస్తోంది. అయితే 28 రోజుల వ్యాలిడిటీతో జియో అందిస్తున్న ప్లాన్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు డేటా, SMS, కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే? జియో రూ.249 ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే సూపర్ బెనిఫిట్స్ పొందొచ్చు.
Also Read:KCR : యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్‌కి ఆహ్వానం..
జియో రూ.249 ప్లాన్
జియో అందించే రూ.249 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. యూజర్లకు రోజుకు 1GB డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు వస్తాయి. వీటితో పాటు కస్టమర్లకు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఇవ్వబడుతుంది. జియో యొక్క ఈ ప్లాన్ పాపులర్ ప్లాన్స్ కేటగిరీలో లిస్ట్ చేయబడింది.
Also Read:Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్
జియో రూ.209 ప్లాన్
ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 22 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. యూజర్లకు రోజుకు 1GB డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు వస్తాయి. వీటితో పాటు కస్టమర్లకు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఇవ్వబడుతుంది.