చలికాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుంటాయి.. చలి నుండి రక్షించుకోవడానికి మనలో చాలా మంది గదిలో హీటర్లను ఉంచుతూ ఉంటారు. ఇలా గదిలో హీటర్లను ఉంచడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది.. కాస్త చలి తగ్గుతుంది.. ఎక్కువ మంది వీటిని ఈ మధ్య వాడుతున్నారు.. అయితే అతిగాహీటర్లను వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. హీటర్లను ఉపయోగించడం వల్ల ముఖ్యంగా పెద్ద పరిమాణంలో ఉన్న హీటర్లను ఉపయోగించడం వల్ల గాల్లో కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ పొగలు పెరుగుతాయి.. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..
వీటిని ఎక్కువగా వాడటం వల్ల జలుబు, తలనొప్పి, ఫ్లూ, కళ్లు, ముక్కు మరియు గొంతులో చికాకుగా ఉండడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. హీటర్ల నుండి వచ్చే పొడి గాలి కారణంగా చర్మం పొడిబారడం, కళ్లు పొడిబారడం, చర్మంపై దద్దుర్లు, ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే నిర్వహణ లేని హీటర్ల కారణంగా ఇంట్లో అగ్ని ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది.. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది..
హీటర్ల వైర్లు సరిగ్గా ఉన్నాయ లేదా అని తరుచూ పరీక్షించుకుంటూ ఉండాలి. అలాగే గదిలో ఉంచే హీటర్లు, గ్యాస్ మరియు కిరోసిన్ తో నడిపే హీటర్లు నైట్రోజన్ ఆక్సైడ్ మరియు సల్పర్ డయాక్సైడ్ వంటి వాయువులను గాల్లోకి వదులుతాయి.. వీటివల్ల ఉబ్బసం, అలర్జీ వంటి శ్వాస సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. అదే విధంగా హీటర్లను వాడడం వాటి నుండి వచ్చే పొడి గాలి కారణంగా కళ్లు ఎర్రగా మారడం, కంటిలో దురద వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాగే హీటర్లను వాడడం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువవుతుంది. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తాయి. కనుక తక్కువ విద్యుత్ వినియోగం ఉండే హీటర్లను ఎంచుకోవడం మంచిది.. వీటిని ఆఫ్ చేశాక కిటికీలు తలుపులను తెరిచి ఉంచడం మంచిది అలాగే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి..