11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi Turbo 6 Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యంతో మరో కొత్త ఫోన్ సందడి చేసేందుకు షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి Turbo 6 Max పేరుతో రానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి పలు లీకులు వెలువడగా.. తాజాగా కీలక స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా 7 అంగుళాల భారీ డిస్ప్లే, 11,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
లీక్ వివరాల ప్రకారం.. ఈ రెడ్మీ టర్బో 6 మాక్స్ లో 7 అంగుళాల 2K LTPS OLED ఫ్లాట్ డిస్ప్లే ఉండనుంది. దీనికి అల్ట్రా స్లిమ్ బెజెల్స్ కూడా ఉండనున్నాయి. దీంతో స్క్రీన్‌పై ఎక్కువ స్థలం అందుబాటులో ఉంటుంది. వీడియోలు చూడటం, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఈ భారీ డిస్ప్లే ఉపయోగపడనుంది. ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన మరో ఫీచర్ 11,000mAh బ్యాటరీ. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నట్లు సమాచారం.
Also Read
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
- 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
- Huawei Qingyun C7: Huawei కొత్త టాబ్లెట్ లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
- 165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
పనితీరు విషయానికి వస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 సిరీస్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇందులో Dimensity 9500 లేదా 9600M ప్రాసెసర్లలో ఒకటి ఉండే అవకాశం ఉంది. దీనికి LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని జత చేయనున్నట్లు సమాచారం. కెమెరా విభాగంలో 50MP మెయిన్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండనుంది. అలాగే అల్ట్రా వైడ్ కెమెరాను కూడా అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రధానంగా పనితీరు, గేమింగ్‌పై దృష్టి పెట్టి రూపొందిస్తున్నందున కెమెరా ఫీచర్లు సాధారణ స్థాయిలో ఉండవచ్చని అంచనా.
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్లో మెటల్ ఫ్రేమ్, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండనున్నట్లు లీకులు వెల్లడిస్తున్నాయి. Redmi Turbo 6 Max పేరులోని ‘Max’కు తగ్గట్టుగానే భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రెడ్మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా ధృవీకరించలేదు. లాంచ్ తేదీ, ధర, ఇతర స్పెసిఫికేషన్లపై కూడా స్పష్టత లేదు. ప్రస్తుతం ఇవన్నీ లీకుల ఆధారంగా వచ్చిన వివరాలే. కంపెనీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
NDA Passing Out Parade: 364 మంది క్యాడెట్లు పాసౌట్.. యూనిఫామ్‌పై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!
-
MS Dhoni: నేను తెలివితక్కువవాడిని అనుకుంటున్నావా?, ఊరికే 300కు పైగా వన్డేలు ఆడలేదు.. టీమిండియా బౌలర్‌పై ధోనీ ఫైర్!
-
Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!