Site icon NTV Telugu

Realme: ఇక పవర్ బ్యాంక్స్ అవసరం లేదు భయ్యా.. త్వరలో కొత్త 15,000mAh బ్యాటరీ మొబైల్!

Realme

Realme

Realme: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సునామీ సృష్టించడానికి రియల్‌మీ సిద్ధమయ్యింది. రెండు రోజుల క్రితమే 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో ఫోన్‌ను టీజ్ చేసిన కంపెనీ, తాజాగా 15,000mAh బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ మొబైల్ ను తీసుకరానున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త మొబైల్ ను ఆగస్టు 27న గ్లోబల్‌గా పరిచయం చేయనుంది రియల్‌మీ.

allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి

రియల్‌మీ ప్రకారం ఈ 15,000mAh బ్యాటరీతో రాబోతున్న స్మార్ట్‌ఫోన్ ఒకే ఛార్జ్‌తో ఐదు రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ బ్యాటరీ ద్వారా ఏకంగా 50 గంటల వరకూ నిరంతర వీడియో ప్లేబ్యాక్ పొందవచ్చని కంపెనీ చెబుతోంది. ఇంత భారీ బ్యాటరీ కెప్యాసిటీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా సన్నగా ఉండటం మరో విశేషం అనే చెప్పాలి. సాధారణంగా భారీ కెప్యాసిటీ ఉన్న బ్యాటరీలు ఉన్న మొబైల్స్ చాలా బరువుగా ఉంటాయి. కానీ, రియల్‌మీ ఈ కాన్సెప్ట్ మోడల్‌ సన్నగా, తేలికగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంత భారీ బ్యాటరీ తయారీకి సిలికాన్-అనోడ్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగియుస్తున్నట్లు సమాచారం.

BCCI-Dream 11: డ్రీమ్‌ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు.. ఐపీఎల్‌కూ రాంరాం!

Exit mobile version