ఎంత ముద్దుగున్నావే.. Maroon కలర్‌లో Realme Narzo 90x 5G లాంచ్.. ఫీచర్స్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme Narzo 90x 5G: రియల్‌మీ (Realme) సంస్థ నుండి 2025లో విడుదలైన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ నార్జో 90x 5G (Realme Narzo 90x 5G)కు కొత్త కలర్ వేరియంట్‌ను ప్రకటించింది. “Valentine’s Special Maroon” అనే ఈ కొత్త ఫినిష్ ఇప్పటికే అందుబాటులో ఉన్న నిట్రో బ్లూ, ఫ్లాష్ బ్లూ కలర్ ఆప్షన్లకు జతగా మూడో వేరియంట్‌గా మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త కలర్ వేరియంట్ ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. వినియోగదారులు దీనిని అమెజాన్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Hyderabad Hawala Racket: పాతబస్తీ అడ్డాగా హవాలా ‘చీకటి’ దందా.. కోడ్ భాషలో కోట్లు మార్పిడి!
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఈ Realme Narzo 90x 5G మొదట డిసెంబర్ 16, 2025న విడుదలైంది. ఇందులో 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉన్నాయి. డిస్‌ప్లేకు DT-Star D+ గ్లాస్ ప్రొటెక్షన్ అందించారు. ఇంకా స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ను కలిగిఉంది. ఇందులో 6GB లేదా 8GB LPDDR4X ర్యామ్, మరియు 128GB స్టోరేజ్ లభిస్తుంది. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.
T20 World Cup Clash: టీమిండియాకు పాక్ స్టార్ బ్యాటర్ హెచ్చరిక..
కెమెరా విభాగంలో 50MP సోనీ IMX852 ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెండు కెమెరాలు కూడా 1080p వీడియో రికార్డింగ్ (30fps)కు సపోర్ట్ చేస్తాయి. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, IP65 రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీతో పాటు 60W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0పై పనిచేస్తుంది. ధర విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఉన్న కలర్ వేరియంట్‌ల ధరలతో సమానంగా ఉండే అవకాశం ఉంది. కొత్త రంగు తప్ప ఫోన్ హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి మార్పులు లేవు. ప్రారంభ రోజు ప్రత్యేక ఆఫర్లు లేదా డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!