Realme C67 4G Launch : అదిరిపోయే ఫీచర్స్ తో రియల్ మీ స్మార్ట్ ఫోన్.. ధర కూడా తక్కువే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే ఫోన్లను లాంచ్ చేస్తుంది.. ఇటీవల భారత మార్కెట్లో రియల్‌మి C67 5జీ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది.. 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ, 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.. అయితే ఈ మొబైల్ ను ఎప్పుడు మార్కెట్ లోకి తీసుకొస్తారో తెలియదు.. మార్కెట్ ఈ ఫోన్ కు డిమాండ్ పెరుగుతుంది..
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఈ హ్యాండ్‌సెట్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. 5జీ వేరియంట్ మాదిరిగానే రియల్‌మి C67 4జీ ఫోన్ సన్నీ ఒయాసిస్ డిజైన్‌ను కలిగి ఉంది.. బయట ఎండ తగలగానే మెరుస్తుంది… క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్, అడ్రినో 610 జీపీయూ ద్వారా సపోర్టుతో రియల్‌మి C67 4జీ ఫోన్ 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 2టీబీ వరకు విస్తరించవచ్చు. అయితే ర్యామ్ వర్చువల్‌గా అదనంగా 8జీబీ వరకు పొడిగించవచ్చు..
అలాగే 4జీ మోడల్ 108ఎంపీ శాంసంగ్ ఐఎస్ఓసెల్ హెచ్ఎం6 ప్రైమరీ సెన్సార్‌తో 3ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు వెనుకవైపు 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది.. కెమెరా విషయానికొస్తే.. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. రియల్‌మి సి67 4జీ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.. అదే విధంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దాదాపు 185 గ్రాముల బరువు ఉంటుంది..
ఇక ధర విషయానికొస్తే.. 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ఇండోనేషియాలో ఐడీఆర్ 2,599,000 (సుమారు రూ. 13,900) ఉంటుంది. అయితే, 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ఐడీఆర్ 2,999,000 (సుమారు రూ. 16,100) వద్ద లిస్టు అయింది. ఈ ఫోన్ బ్లాక్ రాక్, సన్నీ ఒయాసిస్ కలర్‌వేస్‌లో అందిస్తుంది.. జనవరి 4 వరకు ఫ్రీ ఆర్డర్స్ అందుబాటులో ఉన్నాయి..
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..