Site icon NTV Telugu

Digital Fruad : డిజిటల్ పేమెంట్ నేరాలకు ఇక చెక్..!

Rbi

Rbi

Digital Fruad : డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో భారతదేశంలో ఆన్‌లైన్ లావాదేవీలు అమితంగా పెరిగాయి. అయితే, ఈ వృద్ధికి అనుపాతంగా డిజిటల్ మోసాలు కూడా పెరుగుతుండటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. తాజాగా, డిజిటల్ పేమెంట్‌కు సంబంధించి మోసాలను అరికట్టేందుకు ‘డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (DPIP)’ అనే ఆధునిక టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ డీపీఐపీ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వ రంగ , ప్రైవేట్ రంగ బ్యాంకులతో కలిసి రూపొందిస్తున్నారు. ఇది రియల్ టైమ్ డేటా షేరింగ్‌ను ఆధారంగా చేసుకుని, డిజిటల్ లావాదేవీల్లో జరుగుతున్న అనుమానాస్పద చర్యలను సకాలంలో గుర్తించేందుకు సహాయపడుతుంది.

Ayatollah Ali Khamenei: మాపై దాడి చేసి తప్పు చేశారు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ వార్నింగ్..

ఈ వ్యవస్థ ద్వారా డేటాను తక్షణమే విశ్లేషించి మోసాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలు, అలాగే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లను గుర్తించి వాటిని తాత్కాలికంగా బ్లాక్ చేయడం జరుగుతుంది. తద్వారా మోసాలను అరికట్టడంతో పాటు వినియోగదారుల భద్రతను బలోపేతం చేయవచ్చని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, ఈ ప్లాట్‌ఫామ్‌ పూర్తిగా అమలులోకి వచ్చే ముందస్తు ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం. వచ్చే రెండు నెలల్లో ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది డిజిటల్ ఇండియాలో మరొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Sourav Ganguly: రాజకీయాలపై ఆసక్తి లేదు.. ఆ పదవికి మాత్రం సిద్ధం!

Exit mobile version