Site icon NTV Telugu

Poco M6 Plus 5G: ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ గురూ..ఫీచర్స్ అదుర్స్!

Poco M6 Plus 5g

Poco M6 Plus 5g

పోకో కంపెనీ భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్ విడుదల చేసింది. అదే పోకో ఎం6 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ గురువారం లాంచ్ అయ్యింది. ఈ చరవాణి క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సెలరేటెడ్ ఎడిషన్) ప్రాసెసర్‌పై రన్ అవుతోంది. పూర్తి ఫీచర్స్ తెలుసుకుందాం..

READ MORE: Wayanad Landslides : ఏడాది క్రితం స్కూల్ అమ్మాయి రాసిన కథే కేరళలోని వయనాడ్ లో నిజమైంది

పోకో ఎం6 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సెలరేటెడ్ ఎడిషన్) ప్రాసెసర్‌ అమర్చారు. ఇందులో 8 జీబీ ర్యామ్ ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా మరో 8 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధరిత హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎం6 ప్లస్ 5జీ పని చేయనుంది. రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నారు. ఇందులో డ్యూయల్ సైడెడ్ గ్లాస్ డిజైన్, ఐపీ53 రేటెడ్ బిల్డ్, డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ డ్యూయర్ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను ఉంచారు.

READ MORE:Harassment: కాలం ఎటుపోతుంది.. రెండో తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..

ఇందులో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కంపెనీ అమర్చింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా అందించారు. పోకో ఎం6 5జీ, పోకో ఎం6 ప్రో 5జీ మొబైల్స్ కూడా ఈ లైనప్‌లో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 5030 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ53 రేటింగ్ కూడా ఉంది.

READ MORE:Arijit Singh: బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కి ఏమైంది..? తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్

ధర వివరాలు…
పోకో ఎం6 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,499గా కంపెనీ పిక్స్ చేసింది. ఇక టాప్ ఎండ్ మోడల్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించింది. ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version