Kerala Wayanad News : చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. కొన్నిసార్లు పిల్లలు చెప్పినా.. రాసినా అది నిజమవుతాయని అంటారు. అది సరైనదని తేలింది. కేరళలోని వాయనాడ్‌లో జరిగిన విధ్వంసం మధ్య అలాంటి యాదృచ్చిక సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఓ పాఠశాల బాలిక ఏడాది క్రితమే రాసిందని పేర్కొన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక గతేడాది ఓ కథ రాసిందని చెబుతున్నారు. ఈ కథలోని సంఘటనల గురించి ఆమె రాసినది రాసినట్లు వాయనాడ్ పరిస్థితి దాదాపుగా అలాగే మారింది. ఈ కథనం స్కూల్ మ్యాగజైన్‌లో కూడా ప్రచురితమైంది. ఒకే తేడా ఏమిటంటే, ఆ కథ సుఖాంతం అయినప్పటికీ, వాస్తవంలో ఇది మాత్రం విషాదంగా మారింది. వాయనాడ్‌లో ప్రతేడాది ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన విధ్వంసం వల్ల ఇప్పటి వరకు 308మంది చనిపోయారు. మరో 200మందికి పైగా గల్లంతయ్యారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని వాతావరణ శాఖ చెబుతోంది.
Read Also:Harassment: కాలం ఎటుపోతుంది.. రెండో తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..
ఏ కథ రాశారు
ఎనిమిదో తరగతి చదువుతున్న లయ అనే విద్యార్థిని ఈ కథ రాసింది. ఆమె గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, వాయనాడ్‌లో చదువుతుంది. లయ కథ గత సంవత్సరం స్కూల్ మ్యాగజైన్‌లో కూడా ప్రచురించబడింది. లయ రాసిన కథ జలపాతంలో మునిగిపోయే అమ్మాయి గురించి. ఆమె మునిగిపోవడం వల్ల మరణిస్తుంది. మరణం తరువాత ఆమె పక్షి రూపంలో గ్రామానికి తిరిగి వస్తుంది. లయ కథలో పక్షి ఆ ఊరి పిల్లలతో ‘పిల్లలారా, ఈ ఊరి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది.’ వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుండి వర్షపు నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. అలా చెప్పిన పక్షి అందమైన అమ్మాయిగా మారుతుంది. గ్రామస్తులను రక్షించడానికి ఎవరూరారు. తద్వారా వారు మునిగిపోతారు.
Read Also:TTD EO Syamala Rao: శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు
నాన్నను కూడా కోల్పోయింది
ప్రస్తుతం చురమల కొండచరియలు విధ్వంసంలో మునిగిపోయింది. లయ కథలా కాకుండా ఇక్కడి వాతావరణం చాలా బాధాకరం. లయ తన తండ్రి లెనిన్‌ను కూడా కోల్పోయింది. లయ పాఠశాలలో 497 మంది విద్యార్థుల్లో 32 మంది చనిపోయారు. ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, తోబుట్టువులను కూడా కోల్పోయారు. పాఠశాల కూడా దారుణంగా ధ్వంసమైంది. బలమైన నీటి ప్రవాహం పాఠశాల మైదానం, దాని భవనాలను తీవ్రంగా దెబ్బతీసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి ఉన్నికృష్ణన్.. అతని సహచరులు తృటిలో తప్పించుకున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు చురమలలో అద్దె గదిలో ఉంటున్నామని తెలిపారు. వారం రోజుల క్రితం వర్షం పడినప్పుడు మేము స్కూల్లో ఉండబోతున్నామని చెప్పాడు. కానీ మేము ఇంటికి తిరిగి వచ్చాము. కొండచరియలు విరిగిపడి పాఠశాల దెబ్బతింది. అక్కడే ఉండి ఉంటే మేము కూడా కొట్టుకుపోయే వాళ్లమని తెలిపారు.