Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
- ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల
- 7000mAh బ్యాటరీ
- ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, తక్కువ ధరలో మంచి ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒప్పో భారత మార్కెట్లో తన కొత్త Reno 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Oppo Reno 16, Oppo Reno 16C అనే రెండు మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన AI ఫీచర్లు, భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లు గతంలో విడుదలైన Reno 15 సిరీస్‌కు అప్‌గ్రేడ్‌గా వచ్చాయి. రెండు ఫోన్లు ఒకే తరహా డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా వంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి.
Oppo Reno 16, Reno 16C ధరలు
Oppo Reno 16
Also Read
- Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
- 144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
8GB + 256GB -రూ.61,999
12GB + 256GB -రూ.67,999
Oppo Reno 16C
8GB + 128GB -రూ.46,999
8GB + 256GB -రూ.49,999
12GB + 256GB -రూ.55,999
కొత్త ఫోన్ల కొనుగోలుపై కంపెనీ 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు జూలై 9 నుంచి Amazon, Flipkart, Oppo అధికారిక ఈ-స్టోర్, అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి.
Oppo Reno 16 ఫీచర్లు
Oppo Reno 16లో 6.32 అంగుళాల AMOLED డిస్ప్లే అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో Qualcomm Snapdragon 7 Gen 4 AI ప్రాసెసర్, 12GB వరకు RAM, 256GB స్టోరేజ్, Android 16 ఆధారిత ColorOS 16 అందుబాటులో ఉన్నాయి.
కెమెరా
ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ
ఈ ఫోన్లో 6700mAh బ్యాటరీ ఉండగా, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
AI ఫీచర్లు
Reno 16లో పలు కొత్త AI ఫీచర్లు అందించారు.
AI Mind Pilot
AI Snap Key
AI Mind Space
AI Bill Manager
AI Scan
AI Extract
AI Recording Sticker
AI Menu Translation
AI Live Translation
AI Remix Collage
Pop-Out 2.0
AI Flash Photography 3.0
Oppo Reno 16C ఫీచర్లు
Reno 16Cలో 6.57 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ Android 16 ఆధారిత ColorOS 16 అందించారు.
7000mAh భారీ బ్యాటరీ
Reno 16Cలో 7000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
కెమెరా
రియర్ కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండగా, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు.
మన్నికలోనూ ముందంజ
రెండు ఫోన్లకూ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లు లభించాయి. దీంతో నీరు, ధూళి, కఠిన పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఈ స్మార్ట్ఫోన్లకు ఉంటుంది. ప్రీమియం పనితీరు, అధునాతన AI ఫీచర్లు, మెరుగైన కెమెరా అనుభవం కోరుకునే వారికి Oppo Reno 16 మంచి ఎంపిక. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు Oppo Reno 16C సరైన ఎంపికగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్‌జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?