IP69 రేటింగ్, 7000mAh బ్యాటరీ, హైఎండ్ స్పెసిఫికేషన్లు.. మిడ్‌రేంజ్ ధరతో OPPO Reno 15c లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Reno 15c: ఒప్పో (OPPO) సంస్థ కొత్తగా Reno15 సిరీస్‌లో భాగంగా OPPO Reno 15c స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు అందిస్తున్న ఈ ఫోన్, ధర పరంగా కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. భారీ ఫీచర్లు ఉన్నప్పటికీ మీడియం ధర శ్రేణిలోనే తీసుకురావడం మంచి విషయమే అని చెప్పాలి.
AI showdown: AI సామ్రాజ్యంలో సింహాసనం ఎవరిది.? ChatGptకి గట్టి పోటీ ఇస్తున్న Gemini..!
Also Read
- Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
- WhatsApp Shutdown ALERT: అలర్ట్.. ఆ తేదీ నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ ఇదే
- Honor Play 80 Plus: హానర్ ప్లే 80 ప్లస్ విడుదల.. 7,500mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
- Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
ఈ కొత్త మొబైల్ లో 6.57 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉండటంతో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. ఫోన్‌కు ఆకర్షణీయమైన ‘డైనమిక్ స్టెల్లార్ రింగ్ డిజైన్’ అందించారు. అంతేకాదు, IP66, IP68, IP69 రేటింగ్‌లు ఉండటం వల్ల దుమ్ము, నీటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో Snapdragon 6 Gen 1 (4nm) ప్రాసెసర్ ను ఉపయోగించారు. 8GB / 12GB RAM ఆప్షన్లతో పాటు 256GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది.
అలాగే ఇందులో కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండటం మరో ప్లస్ పాయింట్. ఈ ఫోన్‌లోని ప్రధాన హైలైట్ 7000mAh భారీ బ్యాటరీ. దీనికి తోడు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi, Bluetooth 5.4, USB Type-C వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.
YS Jagan on AP Capital: రాజధానిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ఎక్కడా లేదు..!
ధరల విషయానికి వస్తే OPPO Reno 15c 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 కాగా, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ్టర్ గ్లో పింక్, ట్వైలైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఫిబ్రవరి నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!