OPPO K13 Price Hike: షాకింగ్.. తగ్గాల్సింది పోయి భారీగా పెరిగిన ‘ఒప్పో కే13’ ధర!
- స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్
- భారీగా పెరిగిన ఒప్పో కే13 ధర
- ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న మొబైల్ ప్రియులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO K13 5G Price Hike in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’.. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్ ఇచ్చింది. తన మిడ్‌రేంజ్ 5G ఫోన్ ‘ఒప్పో కే13’ 5G ధరను ఒక్కసారిగా పెంచింది. లాంచ్ సమయంలో సరసమైన ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌పై ఇప్పుడు ధరను భారీగా పెంచింది. ఒప్పో కే13 రిలీజ్ 2025 ఏప్రిల్ మాసంలో రిలీజ్ కాగా.. ఇప్పుడు ధర తగ్గాల్సింది పోయి పెరడగంతో మొబైల్ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
లాంచ్ టైమ్‌లో ఒప్పో కే13 5G రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉండగా.. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.19,999కి విడుదల చేసింది. ఈ ధరలతో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఒప్పో ఈ ఫోన్ ధరలను గణనీయంగా పెంచింది. కొత్త ధరల ప్రకారం.. 8GB + 128GB వేరియంట్ రూ.22,999కి చేరింది. 8GB + 256GB వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. అంటే రెండు వేరియంట్లపై కూడా రూ.5,000 మేర ధర పెరిగింది.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ధర పెంపుకు సంబంధించి ఒప్పో అధికారికంగా ఎలాంటి స్పష్టమైన కారణం వెల్లడించలేదు. అయితే పెరిగిన తయారీ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ధర పెంపుతో OPPO K13 5G ఇప్పుడు ఇతర బ్రాండ్ల ఫోన్లతో మరింత గట్టి పోటీ ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికీ ఇది నిరాశ కలిగించే వార్తే. ప్రస్తుతం OPPO K13 5G కొనాలా? లేక ప్రత్యామ్నాయాలను చూడాలా? అన్న ప్రశ్న చాలా మందిలో నెలకొంది.
OPPO K13 Specs:
# 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష రేటు, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# ఆండ్రాయిడ్ 15 (కలర్ ఓఎస్ 15)
# స్నాప్‌డ్రాగన్ 6జనరేషన్ 4 ప్రాసెసర్
# వెనుకవైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా
# 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!